సాక్షి మనీ మంత్ర: మార్కెట్‌లో తీవ్ర ఒడిదొడుకులు.. నష్టాల్లో ముగిసిన సూచీలు | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: మార్కెట్‌లో తీవ్ర ఒడిదొడుకులు.. నష్టాల్లో ముగిసిన సూచీలు

Published Thu, Jan 25 2024 3:42 PM

Stock Market Rally On Today  - Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు గురువారం తీవ్ర ఒడిదొడుకులకు లోనయ్యాయ. మార్కెట్‌ ప్రారంభం నుంచి ముగిసే సమయం వరకు నష్టాల్లో ట్రేడయింది. నిఫ్టీ 75 పాయింట్లు నష్టపోయి 21,378కు చేరింది. సెన్సెక్స్‌ 359 పాయింట్లు దిగజారి 70.700వద్ద ట్రేడింగ్‌ ముగించింది.

మార్కెట్‌ రెగ్యులేటరీ సెబీ ఎఫ్‌ఐఐలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. దాంతో ఎఫ్‌ఐఐలు ఈక్విటీ మార్కెట్‌నుంచి భారీ మొత్తంలో స్టాక్‌లు విక్రయిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దాంతోపాటు చైనా రిజర్వ్‌ రేషియో రిక్వైర్‌మెంట్స్‌(ఆర్‌ఆర్‌ఆర్‌)ను 50 బేసిస్‌ పాయింట్లు కట్‌ చేసింది. దాంతో ఎఫ్‌ఐఐలు భారీగా చైనాకు తరలిపోతున్నట్లు అంచనా వేస్తున్నారు. ఫలితంగా దేశీయ మార్కెట్‌లో కొంత అనిశ్చితి నెలకొంటుందని భావిస్తున్నారు. 

సెన్సెక్స్‌ 30 సూచీలో ఎన్‌టీపీసీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ఫిన్‌సర్వ్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎం అండ్‌ ఎం, టైటాన్‌, టాటా మోటార్స్‌ కంపెనీ స్టాక్‌లు లాభాల్లో ముగిశాయి. టెక్‌ మహీంద్రా, భారతీఎయిర్‌టెల్‌, ఐటీసీ, విప్రో, నెస్లే, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టాటా స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ స్టాక్‌ షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి.  

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
Advertisement