India ranked 67th on Energy Transition Index: World Economic Forum - Sakshi
Sakshi News home page

ఇంధన పరివర్తన ఇండెక్స్‌లో భారత్‌ సత్తా.. మెరుగైన ర్యాంక్‌ సాధన

Published Thu, Jun 29 2023 9:15 AM

India ranked 67th Energy Transition Index WEF - Sakshi

న్యూఢిల్లీ: ఇంధన పరివర్తన(ఎనర్జీ ట్రాన్సిషన్‌) ఇండెక్స్‌లో భారత్‌ 67వ ర్యాంకులో నిలిచినట్లు వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌(డబ్ల్యూఈఎఫ్‌) నివేదిక తాజాగా పేర్కొంది. గ్లోబల్‌ ర్యాంకింగ్స్‌ జాబితాలో స్వీడన్‌ తొలి స్థానాన్ని పొందగా.. డెన్మార్క్, నార్వే, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్‌ టాప్‌–5లో చోటు సాధించాయి. 120 దేశాలతో కూడిన ఈ ఇండెక్స్‌లో అన్ని రకాలుగా ఎనర్జీ ట్రాన్సిషన్‌కు ఊపునిస్తున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ భారత్‌ మాత్రమేనని వెల్లడించింది.

ఐటీ దిగ్గజం యాక్సెంచర్‌ సహకారంతో నివేదికను రూపొందించింది. ప్రపంచ ఇంధన సంక్షోభం, భౌగోళిక, రాజకీయ అనిశ్చితుల కారణంగా ఎనర్జీ ట్రాన్సిషన్‌ మందగించినప్పటికీ భారత్‌ చెప్పుకోదగ్గ చర్యలు చేపట్టినట్లు నివేదిక పేర్కొంది. నిరంతర ఆర్థికాభివృద్ధిని సాధిస్తున్న నేపథ్యంలోనూ భారత్‌ ఇంధన తీవ్రతను తగ్గించుకున్నట్లు తెలియజేసింది.

అంతర్జాతీయ ఇంధనాలను పొందడం ద్వారా కర్బనాలకు సైతం చెక్‌ పెడుతున్నట్లు వెల్లడించింది. అందుబాటులో విద్యుత్‌ నిర్వహణను సమర్ధవంతంగా చేపడుతున్నట్లు ప్రశంసించింది. శుద్ధ ఇంధనాల వినియోగాన్ని పెంచడం, పునరుత్పాదక ఇంధనాలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలు ఇండెక్స్‌లో భారత్‌ మెరుగుపడేందుకు దోహదం చేసినట్లు వివరించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement