‘ఇష్టంలేని పని ఇంకెన్నాళ్లు.. వెంటనే రాజీనామా చేయండి’ | Sakshi
Sakshi News home page

‘ఇష్టంలేని పని ఇంకెన్నాళ్లు.. వెంటనే రాజీనామా చేయండి’

Published Thu, Mar 7 2024 10:21 AM

IBM Said That If You Want To Leave The company Raise Your Hand - Sakshi

పెరుగుతున్న ఆర్థికమాంద్యం భయాల నేపథ్యంలో చాలా టెక్‌ కంపెనీలు కాస్ట్‌కటింగ్‌ పేరిట ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. అందులో కొన్ని కంపెనీలు నేరుగా ఉద్యోగులకు కొలువుల నుంచి తొలగించినట్లు మెయిల్‌ పంపుతున్నాయి. ఇంకొన్ని కంపెనీలు ఉద్యోగులనే వారి కొలువులకు రాజీనామా చేయాలని కోరుతున్నాయి. ఇప్పటికే కంపెనీ మారాలనుకుంటున్న వారికి ఇదో అవకాశంగా ఆ కంపెనీలు చెబుతున్నాయి.

ఉద్యోగుల సంఖ్య‌ను కుదించాల‌ని యోచిస్తున్న ఐబీఎం ఉద్యోగుల‌ను స్వ‌చ్ఛందంగా రాజీనామా చేయాల‌ని కోరుతోంది. కంపెనీలో ప‌నిచేయాల‌ని కోరుకోని వారు స్వ‌చ్ఛందంగా త‌ప్పుకోవ‌చ్చ‌ని ఐబీఎం చెబుతోంది. ఇష్టంలేని పని చేయకూడదని చెప్పింది. ఐబీఎం నుంచి బ‌య‌ట‌కు వెళ్లాల‌ని కోరుకోని ఉద్యోగుల‌ను మాత్రం కంపెనీ తొల‌గించాల‌నుకోవడం లేదని ఓ వార్తా క‌థనం ద్వారా తెలిసింది.

ఉద్యోగుల సంఖ్య‌ను కుదించే క్ర‌మంలో ఐబీఎం ధోర‌ణిలో మార్పు క‌నిపిస్తోంది. స్వ‌చ్ఛందంగా రాజీనామా చేయాల‌ని భావించే ఉద్యోగులు ముందుకు రావాల‌ని ఐబీఎం కోరుతోంది. ఉద్యోగుల సంఖ్య‌ను తగ్గించే క్ర‌మంలో కంపెనీ చేప‌ట్టే చ‌ర్య‌ల్లో ఇది ఓ భాగ‌మ‌ని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఐబీఎం ఈ చ‌ర్య‌ను రిసోర్స్ యాక్ష‌న్‌గా అభివ‌ర్ణిస్తోంది.

ఇదీ చదవండి: ప్రపంచ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న తొలి భారతీయుడు

గ‌త నెల‌లో నాలుగో త్రైమాసిక ఎర్నింగ్స్ కాల్ సంద‌ర్భంగా స్వ‌చ్ఛంద రాజీనామాల ప్ర‌తిపాద‌న‌కు కంపెనీ ఆమోదం తెలిపింది. కంపెనీని వీడ‌టం ఇష్టం లేని వారిని లేఆఫ్స్‌తో తొల‌గించ‌డం కంటే స్వ‌చ్ఛందంగా త‌ప్పుకునే ఉద్దేశం ఉన్న ఉద్యోగుల‌ను గుర్తించాల‌ని ఐబీఎం ఈ ప్ర‌తిపాద‌న‌ను ముందుకు తీసుకువ‌చ్చింది.

Advertisement
Advertisement