బాబుకు భంగపాటు.. బెడిసికొట్టిన టీడీపీ అధినేత పన్నాగం | Sakshi
Sakshi News home page

బాబుకు భంగపాటు.. బెడిసికొట్టిన టీడీపీ అధినేత పన్నాగం

Published Sun, May 5 2024 4:48 AM

Election Commission reacted strongly on TDP

బెడిసికొట్టిన టీడీపీ అధినేత పన్నాగం

ఓటర్లకు అరచేతిలో వైకుంఠం చూపించేందుకు కుతంత్రం

లబ్ధిదారుల నమోదు పేరిట కుట్ర

ఓటర్ల జాబితా వివరాల దుర్వినియోగం

తీవ్రంగా స్పందించిన ఎన్నికల కమిషన్‌ 

ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక

సాక్షి, అమరావతి: అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలను బురిడీ కొట్టించడం చంద్రబాబు మా ర్కు రాజకీయం అన్నది బహిరంగ రహస్యం. 40 ఏళ్లుగా అదే చేస్తున్న ఆయన ప్రస్తుత ఎన్నికల్లో మ రోసారి అదే కుట్రకు యత్నించి అభాసుపాలయ్యారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు చంద్రబాబు పన్నిన కుతంత్రానికి ఎన్నికల కమిషన్‌ గండికొట్టింది. 

గ్యారంటీ కాదు బురిడీ..
ఇక సూపర్‌ సిక్స్‌ అంటూ ఎంతగా ఊదరగొడుతున్నా తనను ప్రజలు ఏమాత్రం నమ్మడంలేదన్న­ది చంద్రబాబు గుర్తించారు. దీంతో ప్రజల్ని మ­స్కా కొట్టేందుకు ఆయనో పన్నాగం పన్నారు. ఇంకా పోలింగ్‌ కూడా కాకముందే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసినట్లుగా ప్రజలకు భ్ర­మ క­ల్పించేందుకు ఎత్తుగడ వేశారు. జూన్‌ 4 తరువాత లబ్ధిదారులకు ఇవిగో ఈ పథకాలు వస్తా­యి.

ఇంతమేర ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని కరపత్రాలు ముద్రించి ఇంటింటికీ పంపిణీ చేపట్టా­రు. ఏకంగా ఓటర్ల జాబితాలోని ఓటర్ల వి­వరాల­ను దుర్వినియోగం చేస్తూ టీడీపీ ఈ కుతంత్రానికి తెగించింది. ఓటర్ల పేర్లతో కార్డులు ము­ద్రించి మ­రీ పంపిణీకి తెగించింది. అంతేకాక.. ఓట­ర్ల వ్యక్తిగత ఫోన్‌ నంబర్లకు ఫోన్లుచేస్తూ మరీ ప్రచారాన్ని ఊదరగొట్టింది. టీడీపీ నేతల వద్ద పే­ర్లు నమోదు చేసుకుంటే చాలు పథకాలిస్తామని ప్ర­లోభాలకు గురిచేసింది. ఆ ప్రచారానికి సంబంధించి ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో విస్తృతంగా వైరల్‌ చేయడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను బురిడీ కొట్టించేందుకు సిద్ధపడింది. 

బాబు కుట్రను తిప్పికొట్టిన ఈసీ..
టీడీపీ చేస్తున్న ప్రచారంపై ఎన్నికల కమిషన్‌ తీ వ్రంగా స్పందించింది.ఇది పూర్తిగా ఓటర్లను ప్ర లోభాలకు గురిచేయడమేనని మండిపడింది. ఒ క్కో ఓటరుకు భవిష్యత్తులో ఇంత లబ్ధిచేకూరుతుందని చెప్పడం ఎన్నికల నియమావళి ఉల్లంఘన,ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడమేనని తేల్చిచెప్పింది. ప్రజాప్రాతినిధ్య చట్టం–1951 ఉల్లంఘన కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఈ మేరకు పత్రికలు, టీవీ చానళ్లు, సోషల్‌ మీడియాలో ప్రచారం చేయడంగానీ ఓటర్లకు కార్డులు పంపిణీ చేసినా నేరంగా పరిగణించి కేసులు నమోదుచేస్తామని స్పష్టంచేసింది. ఎన్నికల కమిషన్‌ సత్వరం అప్రమత్తమై కొరఢా ఝళిపించడంతో చంద్రబాబు కుట్ర బెడిసికొట్టింది. ఓటర్లను మభ్యపెట్టి ఎన్నికల్లో అడ్డదారిలో ప్రయోజనం పొందాలన్న టీడీపీ కుతంత్రానికి తెరపడింది.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement