తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు: సీఎం జగన్‌ | CM YS Jagan Greetings On Telugu Language Day - Sakshi
Sakshi News home page

తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు: సీఎం జగన్‌

Published Tue, Aug 29 2023 10:54 AM

Cm Jagan Greetings On Telugu Language Day - Sakshi

సాక్షి, తాడేపల్లి: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఆధునిక తెలుగుభాషా వేత్తలలో అగ్రగణ్యుడు గిడుగు వెంకట రామమూర్తి గారు. తన ఉద్యమం ద్వారా తెలుగుభాషను సామాన్యుల దగ్గరకు చేర్చి.. వ్యవహారిక భాషను మాధ్యమంగా తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి. భాషా నైపుణ్యాలను వృద్ధిచేయడం ద్వారా అక్షరాస్యత పెంపు.. తద్వారా మానవాభివృద్ధికి విశేషంగా కృషిచేశారు’’ అని సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.

గిడుగు వారి జన్మదినాన్ని పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు’’ అని సీఎం ట్వీటర్‌లో పేర్కొన్నారు.


చదవండి: సీఎం జగన్‌ మానవత్వం.. చిన్నారి వైద్యానికి రూ.41.5 లక్షల సాయం 

Advertisement
 
Advertisement
 
Advertisement