-
మరుగుజ్జు పాత్రలో...
‘విచిత్ర సోదరులు’ చిత్రంలో కమల్‌హాసన్ మరుగుజ్జు పాత్రలో నటించి సంచలనమే సృష్టించారు. ఇప్పుడు అలాంటి పాత్రలోనే షారుఖ్ ఖాన్ నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. ‘దిల్వాలే’ ఫ్లాప్ తర్వాత కథల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్న షారుక్ తన స్టయిల్ మార్చేశారు. అందుకే 50 ఏళ్ల వయసులో కూడా కొత్తగా ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యారు. తాజాగా ‘ఫ్యాన్’ చిత్రంలో ఓ సూపర్‌స్టార్‌గా, ఆ స్టార్‌ని అతిగా ప్రేమించి చివరకు ఆ సూపర్‌స్టార్ పాలిట విలన్‌గా మారిన ఓ అభిమానిగా షారుఖ్ ద్విపాత్రాభినయం చేశారు. ఇప్పటికే విడుదలైన ఈ ‘ఫ్యాన్’ ప్రచార చిత్రం సినిమాపై ఎన్నో అంచ నాలు పెంచేసింది. ప్రస్తుతం ‘ఫ్యాన్’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న షారుఖ్, మరో పక్క ‘రయీస్’ సినిమా చిత్రీకరణను చకచకా పూర్తిచేస్తున్నారు. ‘రయీస్’లో కూడా ఓ నిజజీవిత గ్యాంగ్‌స్టర్ పాత్ర పోషిస్తున్నారు. మరి షారుఖ్ ఆ తరువాత సినిమా ఏంటి? దీని గురించి కొంతకాలం పాటు చాలా చర్చ జరిగింది. అయితే సస్పెన్స్‌కు తెర పడింది. ‘రాంఝణా’, తను వెడ్స్ మను’, ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ లాంటి బ్లాక్‌బస్టర్స్‌తో హిందీ పరిశ్రమను తన వైపు తిప్పుకున్న దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ ఇప్పుడు షారుఖ్‌ను ఓ మరుగుజ్జుగా చూపించనున్నారు. ఇప్పటివరకూ చిన్న చిత్రాలతో పెద్ద స్థాయి డెరైక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆనంద్ ఓ బాలీవుడ్ అగ్రహీరోతో పనిచేయడం ఇదే తొలిసారి. ‘‘ఓ మరుగుజ్జు వ్యక్తి చుట్టూ ఈ సినిమా తిరిగినా షారుఖ్ శైలిలో సాగే పాటలు, రొమాన్స్ కచ్చితంగా ఉంటాయి. కథానాయికను ఇంకా ఖరారు చేయలేదు’’ అని ఆయన చెప్పారు. మరి ఈ సినిమా షారుఖ్ కెరీర్‌కు ఎంత ఉపయోగపడుతుందో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే. -
కమల్ బాటలో విజయ్
సినిమాకు సంబంధించి నంతవరకు ప్రయోగాలంటే ప్రఖ్యాత నటుడు కమలహాసన్ చేయాలి అన్నంతగా ఆయన ఖ్యాతిగాంచారు. అలాంటి నటుడి బాటలో ఇళయదళపతి విజయ్ పయనిస్తున్నారు. అంతేకాదు కమల్ మురిపించిన మరుగుజ్జు పాత్రలో విజయ్ ఆయన్ని మరిపించే ప్రయత్నానికి సిద్ధం అయ్యారని తెలుస్తోంది. విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మారిశన్. ఈ చిత్రంలో ఆయనకు జంటగా శ్రుతిహాసన్, హన్సిక నటిస్తున్నారు. ముఖ్యమైన పాత్రలో అతిలోక సుందరి శ్రీదేవి, ప్రతి నాయకుడిగా సుదీప్ నటిస్తున్నారు. యువ దర్శకుడు శింబుదేవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అందులో ఒకటి మరుగుజ్జు పాత్ర అని తెలుస్తోంది. నటి శ్రీదేవి మహరాణిగా నటిస్తున్నారు. ఆయన కూతురిగా హన్సిక, దళపతిగా సుదీప్ నటిస్తున్నట్లు సమాచారం. ఇది సోషియల్ ఫాంటసీ కథా చిత్రంగా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. విచిత్ర సహోదరులు చిత్రంలో కమలహాసన్ మూడు పాత్రలు పోషించారు. అందులో ఒకటి మరుగుజ్జు పాత్ర. ఆ తరువాత ఇప్పటి వరకు పూర్తిస్థాయి మరుగుజ్జు పాత్రను ఎవరూ పోషించలేదు. ఇన్నాళ్లకి విజయ్ ఆ సాహసం చేస్తున్నారన్నమాట. మరి కమల్ మరుగుజ్జు పాత్రను విజయ్ మరిపిస్తారా? వేచిచూడాల్సిందే.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement