-
విమానంలో నిద్రిస్తున్న అమ్మాయిపై..!
-
విమానంలో నిద్రిస్తున్న అమ్మాయిపై..!
లండన్: విమానంలో నిద్రిస్తున్న యువతిపై లైంగిక దాడి కేసులో భారత సంతతి వ్యాపారవేత్త దోషిగా తేలాడు. అతనికి బ్రిటన్ కోర్టు 20 వారాల జైలుశిక్ష విధించింది. కతార్‌కు చెందిన వ్యాపారవేత్త అయిన సుమన్ దాస్ (46) గత జూలైలో బ్రిటన్‌లోని మాంచెస్టర్ విమానాశ్రయంలో అరెస్టయ్యాడు. బ్రిటన్ విమానంలో తన పక్క సీటులో కూర్చున్న సుమన్.. నిద్రిస్తున్న సమయంలో తనను అసభ్యరీతిలో తాకి.. వెకిలిగా ప్రవర్తించాడని 18 ఏళ్ల యువతి ఆరోపించింది. ఆ యువతి ఆరోపణల్ని సుమన్ తోసిపుచ్చారు. తాను అనుకోకుండా ఆమెను తాకి ఉండొచ్చునని, కానీ ఉద్దేశపూరితంగా తాకలేదని చెప్పుకొచ్చాడు. అయితే, కోర్టు మాత్రం అతన్ని దోషిగా తేల్చింది. ‘అతను ఏం చేస్తున్నాడో అతనికి తెలుసు. ఆ సమయంలో అతడు నిద్రపోవడం లేదు. అతను నన్ను చూస్తున్నాడు. అతను నన్ను చూడటం నేను చూశాను. నేను మేలుకువ ఉన్నానో లేదా తెలుసుకోవడానికి నన్ను చూస్తూనే అసభ్యంగా ప్రవర్తించాడు’ అని బాధితురాలు కోర్టుకు తెలిపింది. తాను మేలుకున్నానని తెలియగానే అతను వెంటనే పక్కకు కదిలాడని పేర్కొంది. ‘ఇది లైంగిక దాడే.. పరిస్థితులను అనుకూలంగా ఈ దారుణానికి నువ్వు పాల్పడ్డాడు. ఇది కొంతసేపే జరిగి ఉండవచ్చు కానీ, అత్యంత సాన్నిహిత్యంగా ఆమెను తాకడం ద్వారా బాధితురాలకి వేదన మిగిల్చావు’ అని జడ్జి సామ్ గూజీ తెలిపారు. భారత్‌లో పుట్టిపెరిగి కతార్‌లో ఉంటున్న సుమన్ దాస్ బ్రిటన్ వాసి కాకపోవడంతో అతనికి కమ్యూనిటీ సర్వీస్‌లాంటి తేలికైన శిక్ష విధించకుండా.. 20 వారాల జైలుశిక్షను కోర్టు విధించింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- వైఎస్ భాస్కర్‌రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
Advertisement