-
ఫైనల్లో పుణే, ఢిల్లీ
చాంపియన్స్ టెన్నిస్ లీగ్ పుణే: చాంపియన్స్ టెన్నిస్ లీగ్‌లో హైదరాబాద్ ఏసెస్ జట్టుకు చుక్కెదురైంది. సోమవారం ఇక్కడ జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ఏసెస్ 24-25 గేమ్‌ల తేడాతో పుణే మరాఠాస్ చేతిలో ఓటమిపాలైంది. లీగ్ దశ ముగిసిన అనంతరం సౌత్జోన్నుంచి అగ్ర స్థానంలో నిలిచిన పుణే తుది పోరుకు అర్హత సాధించింది. ఇరు జట్ల మధ్య జరిగిన ఆఖరి లీగ్ పోరులో... లెజెండ్స్ మ్యాచ్‌లో హైదరాబాద్ ఆటగాడు మార్క్ ఫిలిప్పోసిస్ 6-3తో ప్యాట్ క్యాష్‌ను చిత్తు చేశాడు. మిక్స్డ్ డబుల్స్‌లో పుణే జోడి బాగ్దాటిస్-రద్వాన్‌స్కా 6-3 తేడాతో యూజ్నీ-హింగిస్‌పై గెలుపొందింది. మహిళల సింగిల్స్‌లో హింగిస్ (ఏసెస్) 6-4తో రద్వాన్‌స్కాను ఓడించింది. పురుషుల డబుల్స్‌లో బాగ్దాటిస్-సాకేత్ మైనేని 6-3తో యూజ్నీ-జీవన్(ఏసెస్)పై గెలుపొందారు. చివరి పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో యూజ్నీ 6-5తో బాగ్దాటిస్ను ఓడించాడు. దీంతో ఇరు జట్లు 24-24 గేమ్‌లతో సమంగా నిలిచాయి. కానీ టైబ్రేక్‌లో బాగ్దాటిస్ను విజయం వరించింది. రేపు జరిగే ఫైనల్లో ఢిల్లీ డ్రీమ్స్‌తో పుణే తలపడుతుంది. -
హైదరాబాద్ ఓటమి
పుణే చేతిలో ఓడిన ఏసెస్ సాక్షి, హైదరాబాద్: తొలి పోరులో గెలిచి శుభారంభం చేసిన హైదరాబాద్ ఏసెస్‌కు రెండో మ్యాచ్‌లో చుక్కెదురైంది. చాంపియన్స్ టెన్నిస్ లీగ్‌లో భాగంగా మంగళవారం ఇక్కడి ఎల్బీ స్టేడియం సెంటర్‌కోర్టులో జరిగిన లీగ్ మ్యాచ్‌లో పుణే మరాఠాస్ 26-25 గేమ్‌ల (3-2 మ్యాచ్‌లు) తేడాతో హైదరాబాద్ ఏసెస్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌తో చాంపియన్స్ టెన్నిస్ లీగ్ హైదరాబాద్ రౌండ్ పోటీలు ముగిశాయి. రద్వాన్‌స్కా జోరు మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో రద్వాన్‌స్కా 6-3 తేడాతో హింగిస్ పై విజయం సాధించింది. వరల్డ్ నంబర్ 6 రద్వాన్‌స్కా ముందు అలనాటి చాంపియన్ హింగిస్ తలవంచింది. లెజెండ్స్ మ్యాచ్ లో హైదరాబాద్ ప్లేయర్ మార్క్ ఫిలిప్పోసిస్ 6-3 స్కోరుతో ప్యాట్క్యాష్ను చిత్తు చేశాడు. ఆ తర్వాత మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్ లో ఏసెస్ జోడి యూజ్నీ-హింగిస్ 6-5 (5-3)తో పుణే జంట బాగ్దాటిస్-రద్వాన్స్కాపై విజయం సాధించింది. అనంతరం హోరాహోరీగా సాగిన పురుషుల డబుల్స్‌లో మరాఠా ద్వయం బాగ్దాటిస్-సాకేత్ మైనేని 6-5 తేడాతో ఏసెస్ టీమ్ యూజ్నీ-జీవన్ నెడుంజెళియన్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో నెట్ వద్ద చక్కటి ఆటతీరుతో సాకేత్ ఆకట్టుకున్నాడు. ఈ ఫలితంలో ఇరు జట్లు 2-2 మ్యాచ్‌లతో సమంగా నిలిచాయి. కీలకమైన ఆఖరి మ్యాచ్ పురుషుల సింగిల్స్‌లో బాగ్దాటిస్ 6-5 (5-2) తేడాతో యూజ్నీపై గెలుపొంది తన జట్టుకు విజయాన్ని అందించాడు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్‌లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్‌మన్ గిల్‌కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్‌గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్‌కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement