-
అలా నటించడానికి అస్సలు వెనుకాడను
సినిమా : అలా చేస్తే వ్యక్తిగత విమర్శల దాడి చేస్తారని తెలుసు. అయినా ఐ డోంట్‌కేర్ అంటోంది నటి ఆండ్రియా. సంచలనాలకుకేంద్రబిందువు ఆండ్రియా అంటారు. ఆమె చర్యలు కూడా అలానే ఉంటాయి. అయితే మల్టీ టాలెంటెడ్ నటి ఈ బ్యూటీ. ఈమెలో నటి మాత్రమే కాకుండా మంచి గాయనీ, గీత రచయిత ఉన్నారు. అదే విధంగా బహుభాషా నటి కూడా. తనకు పాత్ర నచ్చితే అది ఏ తరహాదైనా నటించడానికి వెనుకాడదు. ఇటీవల వడచెన్నైలో ఏ హీరోయిన్ చేయడానికి సాహసించని పాత్రను చేసి మెప్పించింది. ప్రస్తుతం హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలకు మారిన ఈ అమ్మడితో చిన్న చిట్‌చాట్. ప్ర: బిడ్డకు అమ్మగా, మద్యం అలవాటు, దమ్ము కొట్టే అమ్మాయి, బూతులు మాట్లాడే మగువ లాంటి పాత్రలో నటిస్తున్నారు. విమర్శల వలయంలో చిక్కుకుంటారని భయం లేదా? జ: నాకు కథా పాత్ర నచ్చితే ఇక దేని గురించి ఆలోచించను. నటించడానికి అస్సలు వెనుకాడను. నెగటీవ్ టచ్ ఉన్న పాత్రల్లో నటిస్తే నాపై వ్యక్తిగత విమర్శల దాడి చేస్తారని తెలుసు. అయినా అలాంటి వాటి గురించి భయపడను. ఒక్కసారి నటించాలని కమిట్ అయితే ఏ తరహా పాత్రనైనా చేయాలన్నది నా అభిప్రాయం. ఇమేజ్ గురించి ఆలోచిస్తే, ఆ చట్రంలోనే ఉండిపోవాల్సి వస్తుంది. ప్ర:కమలహాసన్‌తో వరుసగా చిత్రాలు చేశారు. అంత పెద్ద నటుడితో నటించేటప్పుడు కంగారు, భయం లాంటివి ఎదుర్కొనేవారా? జ: కమలహాసన్ నటుడిగానూ, రాజకీయనాయకుడిగానూ కొనసాగుతున్నారు. ఆయనంటే నాకెంతో గౌరవం. కమల్ ఉత్తమ నటుడు. అయితే సాధారణంగా నేను ఎక్కవ చిత్రాలు చూడను. నా పాత్రల్లో ఎలా నటించాలన్న దాని గురించే అలోచిస్తాను. అంతే కానీ సహ నటుల నటన గురించి ఎప్పుడూ భయపడింది లేదు. ఇక కమలహాసన్‌తో నటిస్తున్నప్పుడు, జంకు గానీ, భయం కానీ కలగదు. అదే విధంగా నేను కమల్ చిత్రాలు చూస్తూ ఎదిగిన నటిని కాదు. అందుకని ఆయనంటే భయం లేదు. ప్ర: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో మీటూ కలకలం సృష్టించడంపై మీ స్పందన? జ:నిజం చెప్పాలంటే మీటూ గురించిన వార్తలను నేను సరిగా చదవలేదు. అయితే అన్ని కాలాల్లోనూ ఈ సమస్య ఉంది. ఇప్పుడే మహిళలకు తమకు జరిగిన అక్రమాల గురించి బహిరంగంగా చెప్పే ధైర్యం, బలం వస్తున్నాయి. భయం కారణంగానే ఇంతకాలం చాలా మంది మహిళలు నోరు మెదపకుండా ఉన్నారు. ఈ తరం వారు ఆ భయాన్ని దాటి మాట్లాడటానికి ధైర్యం చూపుతున్నారు. ఇది మంచి విషయమే. అయితే పది మంది కథలు చెబుతుంటారు. ఇద్దరు ముగ్గురే నిజం చెబుతుంటారు. అలాంటి వారిని మనం గౌరవించాలి. ప్ర: నేత్రదాన అవగాహన కృషి చేస్తున్నారట? జ: అవును. అందరూ నేత్ర దానం చేసేందుకు ముందుకు రావాలి. నేత్రదానం చేయడం మన బాధ్యత. మన జీవితం తరువాత అవి ఇతరులకు జీవితాన్నిస్తాయి. నేనిప్పటికే నేత్రదానం చేశాను. -
దేనికైనా టైమ్ రావాలి
బ్యాడ్ టైమ్‌లో బాధపడి లాభం లేదు. ఓపిక పట్టాలి. దేనికైనా టైమ్ రావాలి అంటున్నారు కథానాయిక ఆండ్రియా జెర్మియా. ఎప్పుడూ స్ట్రైట్ ఫార్వర్డ్‌గా ఉంటారు. ఏ విషయం గురించైనా ధైర్యంగా మాట్లాడతారు. కానీ ఇప్పుడు ఇలా సడన్‌గా ఫిలసాఫికల్ టర్న్ ఎందుకు తీసుకున్నారు? అని ఆండ్రియాని అడిగితే... ‘‘బేసిగ్గా నాకు కాస్త ఓపిక తక్కువ. అన్నీ వెంట వెంటనే జరిగిపోవాలని ఆరాట పడతాను. ‘‘తారామణి’ సినిమాకు మంచి అప్రిషియేషన్ దక్కిన తర్వాత నాకు మంచి మంచి ఆఫర్స్ వస్తాయని ఊహించుకున్నాను. కానీ అలా జరగలేదు. కాస్త దిగులు పడ్డాను. ‘ఇప్పుడు ఆఫర్స్ రావడం లేదని బాధపడకు. అందరూ ఇప్పుడే నీ కోసం పాత్రలు రాస్తూ ఉండొచ్చు. రానున్న రోజుల్లో పుల్ బిజీగా ఉంటావ్’ అని దాదాపు ఎనిమిది నెలల క్రితం దర్శకుడు వెట్రిమారన్ ధైర్యం చెప్పారు. ఎగ్జాట్లీ ఆయన చెప్పినట్లే ఇప్పుడు జరుగుతోంది. మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. అప్పుడు అర్థం అయ్యింది.. దేనికైనా టైమ్ రావాలని. ఇప్పుడు ప్రతికూల పరిస్థితుల్లో ఏమాత్రం కంగారు పడటం లేదు. జాగ్రత్తగా ఆలోచించుకుని ఓర్పుతో నేర్పుగా ముందడుగు వేస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. -
అన్బు అక్టోబర్‌లో వస్తున్నాడు
దర్శకుడు వెట్రిమారన్, హీరో ధనుష్ కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ‘వడ చెన్నై’. ‘పొల్లాదవన్’, ‘ఆడుకలమ్’ వంటి సూపర్ హిట్స్ తర్వాత ఈ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ‘వడ చెన్నై’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం రిలీజ్ డేట్ కోసం ధనుష్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. వాటికి ఫుల్స్టాప్ పెడుతూ ‘‘అన్బు (ధనుష్ పాత్ర పేరు) మీ అందరి దగ్గరకు అక్టోబర్ 17న వస్తున్నాడు’’ అని సినిమా టీమ్ పేర్కొంది. వాస్తవానికి ‘వడ చెన్నై’ని రెండు భాగాలుగా తీస్తున్నారు. ఫస్ట్ పార్ట్ అక్టోబర్‌లో వస్తుంది. సెకండ్ పార్ట్ రిలీజ్‌ను ప్రకటించలేదు. ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో ధనుష్ క్యారమ్‌బోర్డ్ ప్లేయర్‌గా కనిపిస్తారట. ఆండ్రియా, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. -
వాస్తవ ప్రేమకథ!
ఆండ్రియా, అంజలి, వసంత్ రవి ముఖ్య తారలుగా రామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తారామణి’. తమిళంలో హిట్ సాధించిన ఈ సినిమాను అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. డీవీ సినీ క్రియేషన్స్ పతాకంపై డి. వెంకటేశ్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. వచ్చే నెల 21న ఈ సినిమా విడుదల కానుంది. ‘‘ఓ వాస్తవ ప్రేమకథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఆద్యంతం వినోదాత్మకంగా దర్శకుడు తెరకెక్కించాడు. యువన్ శంకర్‌రాజా సంగీతం ఈ సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందన్న నమ్మకం ఉంది. తమిళంలో హిట్ సాధించిన ఈ సినిమా తెలుగులో అంతకంటే పెద్ద హిట్ సాధిస్తుందన్న నమ్మకం ఉంది. ఆండ్రియా, అంజలి నటన ప్రేక్షకులను మెప్పిస్తుంది’’ అన్నారు వెంకటేశ్. -
శ్రీరెడ్డి వ్యవహారం గురించి అడుగుతున్నారు..
తమిళసినిమా: మహిళలకు ధైర్యం అవసరం అంటోంది నటి ఆండ్రియా. తనకు నచ్చిన విధంగా జీవించే అతి కొద్ది మంది నటీమణుల్లో ఈ జాణ ఒకరని చెప్పకతప్పదు. విమర్శలను, వివాదాలను అసలు పట్టించుకోని నటి ఆండ్రియా. తొలుత గాయనిగా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తరువాత నటిగా తెరపైకి వచ్చింది. అలా పచ్చైక్కిళి ముత్తుచ్చారం, ఆయిరత్తిల్ ఒరువన్, విశ్వరూపం, తరమణి చిత్రాల్లో వైవిధ్యభరిత పాత్రలు పోషించి తనకంటూ సొంత ఇమేజ్ను సంపాదించుకున్న ఆండ్రియా తాజాగా కమలహాసన్‌తో నటించిన విశ్వరూపం–2 చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా ఈ ముద్దుగుమ్మ ముచ్చట్లు చూద్దాం. విశ్వరూపం చిత్రానికి కొనసాగింపుగానే విశ్వరూపం–2 ఉంటుంది. ఇందులో అశ్విత పాత్రలో నటించాను. తొలి భాగంలో కంటే రెండో భాగంలోనే అశ్విత ఎవరన్నది ప్రేక్షకులకు అర్థం అవుతుంది. చిత్రంలో ఫైట్స్ కూడా చేశాను. ఇంతకు ముందు కాలక్షేపం కోసమే చిత్రాల్లో నటించాను. అయితే విశ్వరూపం చిత్రంలో నటించిన తరువాత సామాజిక బాధ్యత ఎక్కువైంది. దేశ ప్రగతికి ప్రతి ఒక్కరికి బాధ్యత అవసరం. ఎవరి పని వారు చేయడం కాదు. అదే విధంగా పాఠ్యాంశాల్లో విద్యను అభ్యసించడంతదో సరిపోదు. దేశపోకడలను తెలుసుకోవాలి. నటన విషయంలో నిబంధనలు విధిస్తున్నారా అని అడుగుతున్నారు. చిత్రాల్లో నటించడానికి ఎలాంటి నిబంధనలు విధించను. అయితే కథ నాకు నచ్చాలి. అదే ముఖ్యం. విశ్వరూపం–2 చిత్రం తరువాత వడచెన్నై చిత్రంలో నటించాను. ఆ తరువాత ఏ చిత్రంలోనూ నటించలేదు. ఆరు నెలలు ఖాళీగానే ఉన్నాను. ప్రస్తుతం వడచెన్నై డబ్బింగ్ జరుగుతోంది. ఇద్దరు ముగ్గురు హీరోయిన్ల కథా చిత్రాల్లో నటిస్తున్నారే అని అడుగుతున్నారు. అలా నటించడం వల్ల నా స్థాయి తగ్గుతుందని భావించడం లేదు. నా కథా పాత్ర ఏమిటి? దర్శకుడు ఎవరు? అన్న అంశాలపైనే దృష్టి పెడతాను. నేను నటనతో పాటు గాయనీగానూ కొనసాగుతున్నాను. నా దృష్టిలో ఈ రెండూ ఒకటే. ఎందులో అవకాశం వస్తే అది చేస్తాను. ఇటీవల సంచలనంగా మారిన నటి శ్రీరెడ్డి వ్యవహారం గురించి అడుగుతున్నారు. ఆమె చెప్పేది నిజం అయితే వాటిని బహిరంగ పరచానికి చాలా ధైర్యం కావాలి. నాకైతే అలాంటి సంఘటనలు ఎదురు కాలేదు. అలా ఎవరికైనా జరిగితే ధైర్యంగా బయట పెట్టడం కరెక్ట్. అందుకు కారణం అయిన వారిని కఠినంగా శిక్షించాలి. ఇకపోతే ప్యూచర్ ప్లాన్ ఏమిటీ అని అడుగుతున్నారు. నేను మధ్యాహ్నం భోజనం ఎక్కడ చేస్తానో తెలియదు. అలాంటిది ఫ్యూచర్ ప్లాన్ గురించి అడుతున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్‌గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్‌కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్‌లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement