‘పోకిమన్’ ఆడుతూ.. ఎంత పనిచేశారు! | Sakshi
Sakshi News home page

‘పోకిమన్’ ఆడుతూ.. ఎంత పనిచేశారు!

Published Sat, Jul 23 2016 12:30 PM

‘పోకిమన్’ ఆడుతూ.. ఎంత పనిచేశారు! - Sakshi

‘పోకిమన్ గో’ మొబైల్‌ గేమ్‌ ప్రపంచాన్ని పిచ్చెక్కిస్తోంది. వెనుకా ముందు చూసుకోకుండా ఈ గేడ్‌ ఆడుతున్న ప్రజలు నానా హంగామా చేస్తున్నారు. ‘పోకిమన్ గో’ గేమ్‌లో ‘జాంబీ’ అనే దెయ్యాన్ని పట్టుకోవడానికి వెతుకుతూ వెతుకుతూ కొందరు దేశాల సరిహద్దులే దాటేస్తుండగా.. మరికొందరు తాము ఎక్కడ ఉన్నామన్న స్పృహ కూడా మరిచి ఈ గేమ్‌లో మునిగిపోతున్నారు.

తాజాగా ఫ్లోరిడాలోని స్థానిక న్యూస్‌ చానెల్‌ డబ్ల్యూటీఎస్పీలో ఊహించని ఘటన జరిగింది. యాంకర్‌ స్థానిక వాతావరణ వివరాలు చెబుతుండగా.. ఓ మహిళ ఏకంగా స్టూడియోలోకి వచ్చేసింది. దీంతో వాతావరణ వార్తలు చెబుతున్న యాంకర్ షాక్‌ తిని ఆమె వంక అలా చూస్తూ ఉండిపోయాడు. ఆమె మాత్రం ఆ యాంకర్‌ని, తాను టీవీ స్టూడియోలో ఉన్న విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా తన మొబైల్‌లో మునిగిపోయి.. ‘జాంబీ’ దెయ్యాన్ని పట్టుకోవడానికి ఇటు అటు చక్కర్లు కొట్టింది. ఈ దెబ్బకు బిత్తరపోయిన టీవీ స్టూడియో సిబ్బంది తమ ఆఫీసు ‘పోకిమన్ జిమ్‌’ అయిపోయిందా? అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇద్దరు అమెరికన్లు ‘పోకిమన్‌ గో’ ఆడుతూ.. కెనడా సరిహద్దులను దాటి వెళ్లారు. దీంతో భద్రతా సిబ్బంది వారిని అదుపులోకి తీసుకుంది.
 

Advertisement
 
Advertisement
 
Advertisement