సర్వే సందడి | Sakshi
Sakshi News home page

సర్వే సందడి

Published Wed, Mar 4 2015 3:24 AM

Noise Survey

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఇనుప ఖనిజానికి పెట్టని కోటగా ఉన్న బయ్యారం ప్రాంతంలో కేంద్ర ప్రతినిధి బృందం మంగళవారం మరోసారి సర్వే చేపట్టింది. బయ్యారంలో ఉక్కు కర్మాగారం నిర్మించాలనే ప్రజల డిమాండ్, ప్రభుత్వాలు సైతం సానుకూలత వ్యక్తం చేయడంతో కొద్దిరోజులుగా బయ్యూరం గుట్టలపై సర్వే సందడి మొదలైంది. పూర్తి వెనుకబడిన గిరిజన ప్రాంతం బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడానికి అవసరమైన పరిస్థితులపై పలు దఫాలుగా అధికారులు సర్వే చేస్తున్నారు. దీనిలో భాగంగా జియూలాజికల్ సర్వే బృందం మంగళవారం ఈ ప్రాంతంలో పర్యటించింది. ఇనుప ఖనిజాల లభ్యత, నాణ్యత, కర్మాగారం ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయూలకు సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. దాదాపు 10 రోజులపాటు ఈ బృందం ఇక్కడ పర్యటిస్తుంది.
 
నిక్షేపాల కోసం అన్వేషణ
నిక్షేపాలు ఎంత మేరకు ఉన్నాయో తెలుసుకునేందుకు జియూలాజికల్ ప్రతినిధి బృందం ఉపక్రమించింది. ఇక్కడి ఖనిజ
నిక్షేపాలపై అధ్యయనం కోసం జియూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియూ, రాష్ట్ర భూగర్భగనుల శాఖ అధికారులు, కేంద్ర ప్రతినిధి బృందం పర్యటిస్తున్నారుు. నిక్షేపాల ఎంత మేరకు ఉన్నాయో అధ్యయనం చేస్తున్నారుు. ఇనుప ఖనిజంతో పాటు ఇక్కడి పర్యావరణ పరిస్థితులపై కూడా ఈ బృందాలు దృష్టి సారించారుు. ఇందుకు అటవీశాఖ అధికారుల సహకారాన్ని తీసుకుంటున్నారుు. పర్యావరణ పరమైన సహకారాన్ని అటవీశాఖ అందించనుంది.
 
ఏ శాఖ భూమి ఎంత..?
ఖనిజ నిక్షేపాలు, పర్యావరణ అంశాలపై అధ్యయనం చేస్తున్న ఈ బృందం భూములు, వాటి వివరాలు కూడా సేకరిస్తోంది. ఏ శాఖ భూమి ఎంత ఉందో తెలుసుకుంటోంది. అటవీశాఖ భూమి ఎంత?, ప్రభుత్వ భూమి ఎంత ఉంది? రైతుల పట్టా భూమి ఎంత? అనే అంశాలపై దృష్టి సారించింది. బయ్యూరం ఉక్కు కర్మాగారం నిర్మాణంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సానుకూల పరిస్థితులు ఉన్న దృష్ట్యా మూడునెలలుగా వివిధ సాంకేతిక, గనుల అధికారిక బృందాలు సర్వేలు నిర్వహిస్తున్నారుు. సర్వే బృందాల విస్త­ృత పర్యటన నేపథ్యంలో ఈ ప్రాంత వాసుల్లో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నారుు.
 
మౌలిక వసతులపైనా దృష్టి
బయ్యూరంలో ఉక్కు ఫ్యాక్టరీ ఖాయమైతే ఇక్కడ కల్పించాల్సిన మౌలిక వసతులు, ఖనిజం ఎగుమతి చేయడానికి రవాణా సౌకర్యం, ఖనిజ శుద్ధికి అవసరమైన నీటి సౌకర్యం వంటి అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. కాకతీయుల కాలంలో నిర్మించిన బయ్యూరం పెదచెరువు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా మార్చడం ద్వారా కర్మాగారానికి అవసరమైన నీరు సమకూరే అవకాశం ఉంది. ఈ విషయూన్ని నివేదిక రూపంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రతినిధి బృందం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఉక్కు కర్మాగారంపై త్వరితగతిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఈ ప్రాంత ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
 
పెద్దగుట్టపై అన్వేషణ
బయ్యారం: బయ్యూరం పెద్దగుట్టపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోని జియూలాజికల్ అధికారులు మంగళవారం నుంచి సర్వే ప్రారంభించారు. కేంద్రప్రభుత్వ ఆధీనంలోని జియూలాజికల్ ఇండియూ జియూలజిస్టులు వికాస్‌త్రిపాఠి, దేశ్‌ముఖ్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని మైన్స్, జియూలాజికల్ అధికారులు మొదటిరోజు సర్వే నిర్వహించారు. గుట్టపై ఉన్న ఇనుపరారుుని క్షుణ్ణంగా పరిశీలించారు. అవసరమైన శాంపిల్స్ సేకరించారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఎంఎస్ 14 ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో సంయుక్త సర్వే నిర్వహిస్తున్నామని సర్వే కోఆర్డినేటర్ బి. సత్యనారాయణ విలేకరులకు తెలిపారు. పదిరోజుల పాటు సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు. ఈ సర్వేబృందం వెంట బయ్యూరం అటవీశాఖ అధికారి ప్రసాద్, రాయల్టీ ఇన్‌స్పెక్టర్ రవీందర్, గంగాధర్, వెంకటేశ్వరరావు, నగేశ్, టెక్నికల్ అసిస్టెంట్ శేఖర్, నాగరాజు, పరశురాం ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement