‘స్మార్ట్‌’ కరీంనగర్‌ | Sakshi
Sakshi News home page

‘స్మార్ట్‌’ కరీంనగర్‌

Published Sat, Jun 24 2017 3:48 AM

‘స్మార్ట్‌’ కరీంనగర్‌ - Sakshi

మూడో దశలో దక్కిన ‘స్మార్ట్‌’హోదా
- తెలంగాణలో కరీంనగర్‌కు దక్కిన స్థానం
హైదరాబాద్‌ స్థానంలో కరీంనగర్‌..
స్మార్ట్‌ సిటీలను ప్రకటించిన కేంద్రం
రూ.1,852 కోట్ల అభివృద్ధి ప్రతిపాదనలు
 
సాక్షి, కరీంనగర్‌: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్మార్ట్‌సిటీల జాబితాలో ఎట్టకేలకు కరీంనగర్‌ చోటు దక్కించుకుంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, స్మార్ట్‌సిటీ మిషన్‌ శుక్రవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన స్మార్ట్‌ సదస్సులో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కరీంనగర్‌కు స్మార్ట్‌సిటీ హోదాను ప్రకటించారు. స్మార్ట్‌ సిటీ ప్రకటనతో కరీంనగర్‌కు అరుదైన గౌరవం దక్కినట్లు అయ్యి ంది. అంతేకాకుండా రెండేళ్లుగా ప్రజాప్రతినిధులు, అధికారులు చేస్తున్న కృషికి ఫలితం దక్కింది.
 
హైదరాబాద్‌ స్థానంలో కరీంనగర్‌..
తెలంగాణ నుంచి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌ నగరాలను రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్‌ సిటీల కోసం ప్రమోట్‌ చేసింది. అయితే.. తెలంగాణ రెండింటిని మాత్రమే ఎంపిక చేసేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌కు స్మార్ట్‌సిటీ హోదా ద్వారా వచ్చే రూ.500 కోట్లు ఏ మూలన సరిపోవని భావించి హైదరాబాద్‌ స్థానంలో కరీంనగర్‌ను స్మార్ట్‌ జాబితాలోకి తీసుకోవాలని స్మార్ట్‌ సిటీ మిషన్‌కు లేఖ రాశారు. అలాగే, 2017 మార్చి 31న ఎంపీ వినోద్‌కుమార్‌తో కలిసి మేయర్‌ రవీందర్‌సింగ్, కమిషనర్‌ శశాంక స్మార్ట్‌సిటీ మిషన్‌కు డీపీఆర్‌ను సమర్పించారు. సుమారు 10 నుంచి 50 లక్షల జనాభా ఉన్న నగరాలకే ‘స్మార్ట్‌’హోదా దక్కగా, 3.15 లక్షల జనాభా ఉన్న కరీంనగర్‌ను ఆ స్థానంలో నిలబెట్టేందుకు ఎంపీ వినోద్‌కుమార్‌ చేసిన లాబీయింగ్‌ ఫలించింది.
 
టవర్‌సర్కిల్‌ కేంద్రంగా అభివృద్ధి
స్మార్ట్‌సిటీ కేంద్రంగా కరీంనగర్‌కు చారిత్రాత్మకమైన టవర్‌సర్కిల్‌ను ఎంపిక చేశారు. టవర్‌సర్కిల్‌ చుట్టూ సుమారు 7 కిలోమీటర్ల విస్తీర్ణంలో అభివృద్ధి చేయనున్నారు. సుమారు 60 శాతం నగరం రిట్రోఫిటింగ్‌ కిందకు రానుంది. ఇందులో 29 డివిజన్లు వస్తున్నట్లు తెలిసింది. 2వ డివిజన్‌ నుంచి 24వ డివిజన్‌ వరకు, 28, 29, 31, 38, 39, 45 డివిజన్‌లు ఇందులో చేరగా, మిగతా డివిజన్లను పాన్‌సిటీ కింద అభివృద్ధి చేయనున్నారు. దీనికి కూడా ప్రత్యేక నిధులు కేటాయించనున్నారు. 
 
అభివృద్ధి జరిగే ముఖ్య ప్రాంతాలు..
టవర్‌సర్కిల్‌లోని ప్రధాన వ్యాపార కూడలి, ప్రధాన కూరగాయల మార్కెట్, కోల్డ్‌స్టోరేజీ, కమర్షియల్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణాలు, వీధి వ్యాపారులకు ప్రత్యేక స్థలాలు, పార్కులు, బస్టాండ్, కలెక్టరేట్, మున్సిపల్‌ కార్పొరేషన్, అంబేడ్కర్‌ స్టేడియం, పోలీసు స్టేషన్లు, ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి, పాత బజార్‌ కూడలి, సర్కస్‌ గ్రౌండ్, సైన్స్‌వింగ్‌ కాలేజ్, రైల్వే స్టేషన్, జిల్లా జైలు, మ్యూజియం, తెలంగాణచౌక్, సీఎస్‌ఐ చర్చి ఉన్నాయి. వీటితో పాటు పర్యాటక సమాచార కేంద్రాల ఏర్పాటు చేయనున్నారు. 
 
స్మార్‌ హోదా దక్కితే వచ్చే నిధులు
స్మార్ట్‌ సిటీ మిషన్‌ కింద రూ. 1,000 కోట్లు
రూ. కోట్లలో
రాష్ట్ర వాటా 500 
కేంద్ర వాటా 500
విస్తీర్ణం : 24 చ. కిలోమీటర్లు
మున్సిపాలిటీగా : 1958
గ్రేడ్‌–1 మున్సిపల్‌గా : 1985
కార్పొరేషన్‌గా : 2005
నివాసగృహాలు : 53,000
నగర జనాభా : 3,15,000
నగర ఓటర్లు : 2,26,000
అమృత్‌ హోదా : 2015
కుటుంబాలు : 79,000
నగర డివిజన్లు :    50 
స్లమ్‌లు :    41
 
రూ. కోట్లలో
మొత్తం ప్రతిపాదనలు  1,852
రిట్రోఫిటింగ్‌ 267
వినోదం, పర్యాటకం 76
ప్రజా రవాణా 337
సదుపాయాలు 540
కరెంట్‌ కోసం 83
ఇతర అవసరాలకు 132
రవాణాకు 226
నీటి సరఫరాకు 140
విద్యావిధానానికి 15
స్మార్ట్‌ గవర్నెన్స్‌కు 36

Advertisement
Advertisement