దేవరకొండ: రాజ్‌నాథ్‌ రాకతో కమలదళం జోష్‌ | Sakshi
Sakshi News home page

దేవరకొండ: రాజ్‌నాథ్‌ రాకతో కమలదళం జోష్‌

Published Sat, Dec 1 2018 9:58 AM

Home Minister Rajnath Singh Meeting In Devarakonda - Sakshi

సాక్షి, త్రిపురారం : వేలాదిగా తరలివచ్చిన జనంతో హాలియా మండల కేంద్రం కమలమయంగా మారింది. హాలియాలో శుక్రవారం నిర్వహించిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ బహిరంగ సభ విజయవంతం కావడంతో బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం కనిపించింది. హాలియాలోని దేవరకొండ రహదారికి సమీపంలోని మైదానంలో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభ జన సందోహంతో నిండిపోయింది. మహిళల కోలా టం, నృత్యాలతో బీజేపీ పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్‌ను నింపింది. ఈ సభకు పార్టీ కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోని గ్రామగ్రామాల నుంచి ప్రజలు తరలివడంతో సభా ప్రాంగణమంతా నిండిపోయింది. రాజ్‌నాథ్‌సింగ్‌ సభకు రావడం  ఆలస్యమైనప్పటికీ ప్రజలకు ఎలాంటి నిరుత్సాహం లేకుండా కళాకారులు తమ ఆటపాటలతో జోష్‌ నింపారు. కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు, టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలకు వ్యతిరేకంగా పాడిన పాటలతో పాటు కేంద్రంలో బీజేపీ ప్రభుతం అమలు చేస్తున్న పలు అభివృద్థి సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరిస్తూ కళాకారులు బృందం ఆటపాటలతో ప్రజలను అలరించారు.  

మరిన్ని వార్తాలు...

1/1

ర్యాలీ నిర్వహిస్తున్న నాయకులు

Advertisement
 
Advertisement
 
Advertisement