‘అక్బరుద్దీన్‌’ కేసు తీర్పుపై హైకోర్టులో అప్పీల్‌ | Sakshi
Sakshi News home page

‘అక్బరుద్దీన్‌’ కేసు తీర్పుపై హైకోర్టులో అప్పీల్‌

Published Sun, Jul 23 2017 2:51 AM

‘అక్బరుద్దీన్‌’ కేసు తీర్పుపై హైకోర్టులో అప్పీల్‌ - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మజ్లిస్‌ పార్టీ శాసనçసభాపక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీపై హత్యా యత్నం కేసులో ప్రధాన నిందితుడు మహ్మద్‌ బిన్‌ ఒమర్‌ యాఫై అలియాస్‌ మహ్మద్‌ పహిల్వాన్‌ సహా 10 మందిని నిర్ధోషులుగా ప్రకటిస్తూ 7వ అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి ఇటీవల వెలువరించిన తీర్పును హైకోర్టులో ప్రభుత్వం సవాల్‌ చేసింది. అదే విధంగా ఈ కేసులో హసన్, అబ్దుల్లా, వాహిద్, వహ్లాన్‌లను దోషులుగా నిర్ధారించి సెషన్స్‌ కోర్టు విధించిన శిక్షను సైతం పెంచాలని హైకోర్టులో క్రిమినల్‌ అప్పీల్‌ పిటిషన్లు ప్రభుత్వం దాఖలు చేసింది. ఈ కేసు తీర్పుపై హైకోర్టులో అప్పీల్‌ చేయాలని ఇప్పటికే రాష్ట్ర పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సి.ప్రతాప్‌రెడ్డి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీనిపై న్యాయపరమైన అంశాలన్నింటినీ పరిశీలించిన ప్రభుత్వం తాజాగా హైకోర్టులో క్రిమినల్‌ అప్పీల్‌ పిటిషన్లు దాఖలు చేసింది.

Advertisement
Advertisement