కండోమ్స్‌ కోసం యువకుడి ధర్నా | Sakshi
Sakshi News home page

కండోమ్స్‌ కోసం యువకుడి ధర్నా

Published Wed, Jul 12 2017 8:04 PM

కండోమ్స్‌ కోసం యువకుడి ధర్నా - Sakshi

తుమకూరు: ఆస్పత్రిలో కండోమ్‌లు అందుబాటులో ఉంచలేదని ఓ యువకుడు ధర్నాకు దిగిన ఘటన కర్ణాటక జిల్లాలోని తిపటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం చోటు చేసుకుంది. చిక్కమంగళూరు జిల్లాకు చెందిన గణేశ్ మడేనహళ్లి గ్రామానికి చెందిన మహిళను వివాహాం చేసుకున్నాడు. మంగళూరు నుంచి అత్త గారి ఇంటికి వచ్చిన అతను కండోమ్ కోసం ప్రభుత్వాసుపత్రికి వెళ్లాడు. అక్కడ కండోమ్స్ బాక్స్ లేకపోవడంతో ఆరా తీశాడు.

కండోమ్స్ లేవని సిబ్బంది పేర్కొనడంతో ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగాడు. కండోమ్స్ నిల్వ లేవని, తామేమి చేయలేమని సిబ్బంది అతనికి నచ్చజెప్పారు. అయితే అతను ఆందోళన కొనసాగించడంతో చేసేదేమి లేక సిబ్బంది బయట మెడికల్ దుకాణానికి వెళ్లి కండోమ్స్ పాకెట్లు తెచ్చి అతనికి  అందజేశారు. దీంతో అతను ఆందోళన విరమించి వెళ్లిపోయాడు.


 

Advertisement
 
Advertisement
 
Advertisement