ప్రజా సంక్షేమ కూటమికి కెప్టెన్ గుడ్బై | Sakshi
Sakshi News home page

ప్రజా సంక్షేమ కూటమికి కెప్టెన్ గుడ్బై

Published Mon, Jun 20 2016 3:36 PM

ప్రజా సంక్షేమ కూటమికి కెప్టెన్ గుడ్బై

చెన్నై: ప్రజా సంక్షేమ కూటమి (పీడబ్ల్యూఎఫ్)కి డీఎండీకే నేత విజయ్ కాంత్ గుడ్బై చెప్పారు. స్థానిక ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఆయన సోమవారమిక్కడ ప్రకటించారు. కాగా గత ప్రభుత్వంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించిన విజయ్ కాంత్ తాజాగా జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. ప్రజా సంక్షేమ కూటమి(పీడబ్ల్యూపీ)తో జట్టు కట్టిన ఆయన ఒక్కసీటు కూడా గెలుచుకోలేకపోయారు. కింగ్ మేకర్ అవుతారనుకున్న 'కెప్టెన్'  చివరకు కుదేలయ్యారు. 'అమ్మ' హవాకు కొట్టుకుపోయారు.

డీఎంకే ఆహ్వానాన్ని తిరస్కరించి ప్రజా సంక్షేమ కూటమి(పీబ్ల్యూఎఫ్‌)తో ఎన్నికల్లో పోటీ చేసిన విజయ్ కాంత్ చివరకు బోర్లా పడ్డారు. పీబ్ల్యూఎఫ్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో నిలిచిన  విజయ్ కాంత్  తన సీటు కూడా కాపాడుకోలేకపోయారు. ఉలందూరుపేట నుంచి పోటీ చేసిన కెప్టెన్ డిపాజిట్ కూడా కోల్పోయి మూడో స్థానంలో నిలిచారు. ఈ ఎన్నికల్లో డీఎండీకే పార్టీకి కేవలం 2.4 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.  ఇక 2011లో రిషివాందియమ్, 2006లో విరుదాచలం నుంచి పోటీ చేసి గెలిచిన ఆయన మూడో పర్యాయం ఎన్నికల్లో భంగపాటుకు గురయిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
 
Advertisement