విశాఖ-చెన్నై కారిడార్‌పై అధ్యయనం పూర్తి
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు సంబంధించి ఏడీబీ (ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్) అధ్యయనం పూర్తయిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. విదేశీ ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి సోమవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన డాష్ బోర్డ్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఏడీబీ అధ్యయనం పూర్తయిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
ఐఐఎఫ్‌టీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ సంస్థలను కాకినాడ ఎక్స్‌పోర్ట్ జోన్‌లో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించిందన్నారు. ఎన్‌ఐడీ-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌ను విజయవాడలో ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే తాత్కాలిక భవనంలో తరగతులు ప్రారంభించామన్నారు. విదేశీ ఎగుమతులు, దిగుమతుల వ్యవహారాలను పూర్తి పారదర్శకతతో నిర్వహించడానికే డాష్‌బోర్డ్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. డెరైక్టర్ జన రల్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ దీన్ని నిర్వహిస్తుంద ని వివరించారు.