ట్విట్టర్లో సైనాకు అభినందనల వెల్లువ | Sakshi
Sakshi News home page

ట్విట్టర్లో సైనాకు అభినందనల వెల్లువ

Published Sat, Mar 28 2015 5:38 PM

ట్విట్టర్లో సైనాకు అభినందనల వెల్లువ - Sakshi

ప్రపంచ నెంబర్ 1 ర్యాంకు సాధించిన హైదరాబాద్ ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ట్విట్టర్ నిండా సైనా మానియా కనిపిస్తోంది. పలు వర్గాల ప్రజలు ఆమెను అభినందిస్తున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వయంగా ట్విట్టర్ ద్వారా సైనాను అభినందించారు. ''ప్రపంచ నెంబర్ 1 ర్యాంకు సాధించిన సైనా నెహ్వాల్కు అభినందనలు. ఆమెకు ఈ గౌరవం రావాల్సిందే. ఇండియన్ ఓపెన్ సెమీఫైనల్ మ్యాచ్ సందర్భంగా శుభాకాంక్షలు'' అని రాష్ట్రపతి ప్రణబ్ తన ట్వీట్ ద్వారా చెప్పారు. ఇంకా పలువురు కూడా ఆమెను అభినందించారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement