సఫారీలు ఏడ్చేశారు | Sakshi
Sakshi News home page

సఫారీలు ఏడ్చేశారు

Published Tue, Mar 24 2015 3:25 PM

సఫారీలు ఏడ్చేశారు

సఫారీలు చోకర్స్ అని మరోసారి నిరూపించుకున్నారు. లీగ్ దశలో అద్భుతంగా ఆడి కీలక నాకౌట్ సమరంలో ఒత్తిడికి గురై చతికిలపడే అలవాటున్న దక్షిణాఫ్రికా మరోసారి ఈ బలహీనతను చాటుకుంది. కీలక సమయంలో క్యాచ్ లు జారవిడవడంతో పాటు దురదృష్టం కూడా వెంటాడింది. న్యూజిలాండ్తో ప్రపంచ కప్ సెమీస్ పోరులో ఓటమి చవిచూసి టోర్నీ నుంచి నిష్ర్కమించింది. ప్రపంచ కప్లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఫైనల్ చేరని సౌతాఫ్రికా.. నాలుగో సారి సెమీస్ గండాన్ని అధిగమించలేకపోయింది. దీంతో తొలిసారి ఫైనల్ చేరి చరిత్ర సృష్టించాలని ఆశించిన సౌతాఫ్రికాకు తీవ్ర నిరాశ ఎదురైంది. ప్రపంచ కప్ కల మరోసారి కలగానే మిగిలిపోయింది.

ప్రపంచ కప్లో సౌతాఫ్రికా హాట్ ఫేవరెట్గా బరిలో దిగింది. అన్ని విభాగాల్లో బలంగా సఫారీలపై భారీ అంచనాలుండేవి. లీగ్ దశలో భారత్, పాకిస్థాన్ల చేతిలో ఓడినా మిగిలిన 4 నాలుగు మ్యాచ్ల్లో ఘనవిజయాలు సాధించింది. రెండుసార్లు 400 పైచిలుకు స్కోర్లు సాధించింది. క్వార్టర్స్లో శ్రీలంకపైనే ఇదే జోరు కొనసాగించింది. టాపార్డర్ బ్యాట్స్మెన్ అందరూ ఫామ్లో ఉన్నారు. భీకరమైన ఫాస్ట్ బౌలర్లకు కొదవలేదు. సెమీస్లో కూడా సఫారీలు స్థాయి మేర రాణించినా కీలక సమయాల్లో క్యాచ్ లు జారవిడచడం ప్రతికూలంగా మారింది. స్టెయిన్ బౌలింగ్ లో ఇలియట్ సిక్సర్ సంధించడంతో కివీస్ విజయం ఖాయమైంది. అంతే సఫారీలు ఒక్కసారిగా ఓటమి బాధతో మైదానంలో్ ఏడ్చేశారు.

Advertisement
Advertisement