‘పద్మశ్రీ’ అందుకున్న సింధు | Sakshi
Sakshi News home page

‘పద్మశ్రీ’ అందుకున్న సింధు

Published Tue, Mar 31 2015 1:09 AM

‘పద్మశ్రీ’ అందుకున్న సింధు

న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ రైజింగ్ స్టార్ పీవీ సింధు ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంది. రాష్ర్టపతి భవన్‌లో సోమవారం ఈ అవార్డుల కార్యక్రమం వైభవంగా జరిగింది. సింధుతో పాటు భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ సర్దార్ సింగ్, వికలాంగ పర్వతారోహకురాలు అరుణిమ సిన్హా కూడా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరించారు. భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్, మహిళల హాకీ మాజీ కెప్టెన్ సాబా అంజుమ్‌లకు తర్వాత జరిగే మరో కార్యక్రమంలో అందజేస్తారు.
 
ఇక బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో వరుసగా రెండుసార్లు కాంస్యం సాధించిన సింధు ఈ పురస్కారం అందుకోవడం గర్వకారణంగా పేర్కొంది. ‘రాష్ట్రపతి నుంచి పద్మశ్రీ అవార్డును అందుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. నమ్మలేకుండా ఉన్నాను’ అని ట్వీట్ చేసింది.

16 ఏళ్ల అనంతరం భారత హాకీ జట్టు ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించేందుకు కెప్టెన్ సర్దార్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. 59 ఏళ్ల మాజీ రెజ్లర్ సత్పాల్ సింగ్ ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. 2010లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన సుశీల్ కుమార్.. సత్పాల్ శిష్యుడే. 16 సార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచిన సత్పాల్ 1974లో అర్జున, 83లో పద్మశ్రీ, 2009లో ద్రోణాచార్య అవార్డును అందుకున్నారు.

Advertisement
Advertisement