ధోనీ నమ్మకాన్ని నిలబెట్టాడు! | Sakshi
Sakshi News home page

ధోనీ నమ్మకాన్ని నిలబెట్టాడు!

Published Fri, Dec 2 2016 11:12 PM

ధోనీ నమ్మకాన్ని నిలబెట్టాడు!

న్యూఢిల్లీ: టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సంబంధించి కొన్ని షాకింగ్ విషయాలను మాజీ క్రికెటర్ వీరెంద్ర సెహ్వాగ్ వెల్లడించాడు. ప్రస్తుతం టెస్ట్ కెప్టెన్‌గానూ, టీమిండియా తరఫున అత్యుత్తమ వన్డే, టెస్ట్, టీ20 ఆటగాడిగానూ కోహ్లీ పేరు గడించాడు. కానీ అతడి టెస్ట్ కెరీర్ మాత్రం సాధారణ ఆటతీరుతో మొదలైంది. దీంతో కోహ్లీని టెస్ట్ జట్టు నుంచి కొన్ని మ్యాచ్‌లు తప్పించాలని సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారని సెహ్వాగ్ తెలిపాడు.

2012లో జరిగిన ఆస్ట్రేలియాతో జరిగిన పెర్త్ టెస్టులో కోహ్లీని తప్పించి, అతడి స్థానాన్ని రోహిత్ శర్మతో భర్తీ చేయాలని డిసైడ్ అయ్యారు. అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాత్రం విరాట్ గొప్ప ప్లేయర్ అవుతాడని, అతడిపై మనం నమ్మకం ఉంచాలని అందరికీ నచ్చజెప్పాడట. సరిగ్గా పెర్త్ టెస్టులో కోహ్లీ రెండు ఇన్నింగ్స్‌ల్లో 44 పరుగులు, 75 పరుగులు చేసి బ్యాటింగ్‌లో తాను సమర్ధుడు అని నిరూపించుకున్నాడు. తర్వాత అడిలైడ్‌ టెస్టులో తొలి శతకాన్ని సాధించాడని, ధోనీ రిటైర్మెంట్‌తో ఏకంగా టెస్ట్ కెప్టెన్సీని సొంతం చేసుకున్నాడని సెహ్వాగ్ వివరించాడు. ధోనీ నమ్మకాన్ని కోహ్లీ నిలబెట్టాడని, టీమిండియాలోనే కాదు ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గానూ కోహ్లీ రికార్డుల మోత మోగిస్తున్నాడు.

Advertisement
Advertisement