ఫైనల్లో శ్యామ్‌కుమార్‌ | Sakshi
Sakshi News home page

ఫైనల్లో శ్యామ్‌కుమార్‌

Published Thu, Feb 1 2018 12:19 AM

Indian boxer  Shyam Kumar in the final - Sakshi

న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్‌ అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో భారత బాక్సర్‌ కాకర శ్యామ్‌ కుమార్‌ (49 కేజీలు) ఫైనల్లో ప్రవేశించాడు. వైజాగ్‌కు చెందిన శ్యామ్‌ బుధవారం సెమీ ఫైనల్లో థానీ నారిన్రామ్‌ (థాయ్‌లాండ్‌) పై గెలుపొందాడు. ప్రత్యర్థి నుంచి వాకోవర్‌ లభించడంతో శ్యామ్‌ కుమార్‌ సునాయాసంగా ఫైనల్‌కు చేరాడు. మరో సెమీస్‌లో అమిత్‌ (భారత్‌) 4–1తో నట్లాయి లాల్‌బియాకిమా (భారత్‌)పై గెలుపొంది తుదిపోరుకు చేరాడు. శ్యామ్‌కుమార్‌ ఫైనల్లో అమిత్‌ (భారత్‌)తో తలపడనున్నాడు.   

సతీశ్‌ కుమార్‌ (ప్లస్‌ 91 కేజీలు), అమిత్‌ (49 కేజీలు), మనీశ్‌ (60 కేజీలు), సంజీత్‌ (91 కేజీలు) కూడా ఫైనల్‌కు చేరుకున్నారు. మహిళల విభాగంలో మేరీకోమ్‌ (48 కేజీలు), మీనాకుమారి (54 కేజీలు), సోనియా (57 కేజీలు), సరితా దేవి (60 కేజీలు), పూజా (69 కేజీలు), సవితి బోరా (75 కేజీలు) సెమీఫైనల్లో అడుగుపెట్టారు.   

Advertisement
 
Advertisement
 
Advertisement