హంపి, హారిక గేమ్ లు ‘డ్రా’ | Sakshi
Sakshi News home page

హంపి, హారిక గేమ్ లు ‘డ్రా’

Published Sun, Feb 14 2016 12:52 AM

humpy  ,harika game draw in fide chess champion ship

టెహ్రాన్ (ఇరాన్): ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక తమ గేమ్‌లను ‘డ్రా’గా ముగించారు. నానా జాగ్‌నిద్జే (జార్జియా)తో శనివారం జరిగిన మూడో రౌండ్ గేమ్‌లో నల్లపావులతో పోటీపడిన హంపి 44 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. వాలెంటినా గునీనా (రష్యా)తో జరిగిన గేమ్‌ను హారిక 19 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. మూడో రౌండ్ తర్వాత హాంపి ఖాతాలో 2 పాయిం ట్లు, హారిక ఖాతాలో ఒక పాయింట్ ఉన్నాయి. 12 మంది అగ్రశ్రేణి క్రీడాకారిణుల మధ్య 11 రౌండ్లపాటు జరుగుతున్న ఈ టోర్నీ 23న ముగుస్తుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement