మూడో టెస్టు:భారీ స్కోరు దిశగా ఇంగ్లండ్ | Sakshi
Sakshi News home page

మూడో టెస్టు:భారీ స్కోరు దిశగా ఇంగ్లండ్

Published Sun, Jul 27 2014 10:36 PM

మూడో టెస్టు:భారీ స్కోరు దిశగా ఇంగ్లండ్

సౌతాంప్టన్: రెండో టెస్టు ఓటమి ఇంగ్లండ్ కు ఓ గుణపాఠం. అందుకు తగ్గట్టుగానే మూడో టెస్టులో దూసుకుపోతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఓటమిని పునరావృతం చేయమని చెప్పిన ఇంగ్లండ్.. ఆ తరహా ఆటతోనే ఆకట్టుకుంటోంది. భారత్ తో ఇక్కడ జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో ఇంగ్లండ్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ను ఎంచుకుంది. దీనిలో భాగంగా ఇంగ్లండ్ తొలిరోజు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇంగ్లండ్ ఓపెనర్లు అలెస్టర్ కుక్, రాబ్సన్ లు ఇన్నింగ్స్ ను నిలకడగా ఆరంభించారు. రాబ్సన్ (26) పరుగులకు వికెట్టును కోల్పోయినా, కుక్ (95) పరుగులతో మరోసారి ఆకట్టుకున్నాడు. అనంతంర బ్యాలెన్స్ (104) పరుగులు చేసి నాటౌట్ గా క్రీజ్ లో ఉన్నాడు. అతనికి తోడుగా ఇయాన్ బెల్ (16) పరుగులతో ఆడుతున్నాడు.

 

తొలిరోజు ఆటముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ 247 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.భారత్ బౌలర్లలో మహ్మద్ సమీ, జడేజాలకు తలో వికెట్టు లభించింది.

Advertisement
Advertisement