స్టాలిన్‌ నాయకత్వాన్ని అంగీకరిస్తున్నా | Sakshi
Sakshi News home page

స్టాలిన్‌ నాయకత్వాన్ని అంగీకరిస్తున్నా

Published Fri, Aug 31 2018 4:35 AM

Alagiri says he is ready to accept MK Stalin as his leader - Sakshi

మదురై: తనను డీఎంకే పార్టీలోకి తిరిగి చేర్చుకుంటే స్టాలిన్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ఆ పార్టీ బహిష్కృత నేత, కరుణానిధి కొడుకు అళగిరి  ప్రకటించారు. ‘మేం డీఎంకేలోకి రావాలనుకుంటున్నాం. అంటే, స్టాలిన్‌ నాయకత్వాన్ని అంగీకరించినట్లే కదా?. నాతోపాటు నా కొడుకు దురై దయానిధి సైతం పార్టీలో ఎలాంటి స్థానం కల్పించినా పనిచేసేందుకు సిద్ధం’ అని అన్నారు. ‘వచ్చే నెల 5న చెన్నైలో కరుణానిధి సమాధి వద్ద ర్యాలీ  తర్వాత కార్యాచరణను నిర్ణయిస్తాం. డీఎంకే అంటే1,500 మంది కౌన్సిల్‌ సభ్యులు మాత్రమే కాదు. అసలైన కేడర్‌ అంతా నాతో ఉంది’ అని అన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement