గ్రహం అనుగ్రహం, శుక్రవారం 9, అక్టోబర్ 2015 | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం, శుక్రవారం 9, అక్టోబర్ 2015

Published Fri, Oct 9 2015 12:17 AM

గ్రహం అనుగ్రహం, శుక్రవారం 9, అక్టోబర్ 2015 - Sakshi

 శ్రీ మన్మథనామ సంవత్సరం
 దక్షిణాయనం, వర్ష ఋతువు
 భాద్రపద మాసం
 తిథి బ.ద్వాదశి రా.10.04 వరకు
 నక్షత్రం మఖ సా.5.51 వరకు, తదుపరి పుబ్బ
 వర్జ్యం ఉ.4.57 నుంచి 6.40 వరకు
 దుర్ముహూర్తం ఉ.8.16 నుంచి 9.06 వరకు
 తదుపరి ప.12.12 నుంచి 1.02 వరకు
 అమృతఘడియలు ప.3.23 నుంచి 5.10 వరకు
 సూర్యోదయం:    5.55
 సూర్యాస్తమయం: 5.4
 రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
 యమగండం: ప.3.00 నుంచి 4.30 వరకు

భవిష్యం
 మేషం: పనుల్లో జాప్యం జరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు అంతగా అనుకూలించవు. వ్యయ ప్రయాసలు. అనారోగ్యం. బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగులకు పనిభారం.
 
 వృషభం: ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వ్యవహారాలలో ఆటంకాలు కలగవచ్చు. ధన వ్యయం. దూరప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి.
 
 మిథునం: పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు.విందు వినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
 
 కర్కాటకం: పనులు నెమ్మదిగా సాగుతాయి. మిత్రులతో కలహాలు రావచ్చు. రుణాలు చేస్తారు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు చికాకులు.
 
 సింహం: దూరపు బంధువులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ఇంటా బయటా ప్రోత్సాహం అందుతుంది. విద్యావకాశాలు. వస్తు లాభాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు అనుకోని పదోన్నతులు.
 
 కన్య: బంధువులతో విభేదాలు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడులు. దైవచింతన.
 
 తుల: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. బంధువుల కలయిక. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.
 
 వృశ్చికం: ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాత మిత్రులను కలుసుకుంటారు. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.
 
 ధనుస్సు: రుణయత్నాలు. ఇంటా బయటా వ్యతిరేకత ఎదురౌతుంది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
 
 మకరం: మిత్రులతో విభేదాలు రావచ్చు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. శ్రమ తప్ప ఫలితం ఉండదు. నిరుద్యోగుల యత్నాలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా ఉంటాయి.
 
 కుంభం: అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. వస్తు లాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.
 
 మీనం: దూరపు బంధువుల నుంచి సహాయం. కొత్త ఉద్యోగావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
 - సింహంభట్ల సుబ్బారావు

Advertisement
Advertisement