వైర‌ల్: నిన్ను కూడా క్వారంటైన్‌కు పంపిస్తారు | Sakshi
Sakshi News home page

వైర‌ల్ వీడియో: నిన్ను కూడా క్వారంటైన్‌కు పంపిస్తారు

Published Fri, Mar 27 2020 9:10 AM

Viral Video:Indian  Bison Enjoying A Walk On Karnataka Street - Sakshi

సాక్షి, బెంగళూరు : కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ప్ర‌జ‌లంద‌రూ ఇంట్లోనే ఉంటూ కుటుంబ స‌భ్యుల‌తో స‌రదాగా గ‌డుపుతున్నారు. ప్ర‌జ‌లంతా ఇళ్ల‌కే ప‌రిమితం అవ్వ‌డంతో రోడ్ల‌న్నీ బోసిపోతున్నాయి. నిత్యం జ‌నాల‌తో కిక్కిరిసిపోయే ర‌హ‌దారుల‌న్నీ ఎవ‌రూ లేక వెల‌వెల‌పోతున్నాయి. ఈ నేప‌థ్యంలో జ‌న సంచారంలోకి రావ‌డానికి బ‌య‌ప‌డే జంతువులు సైతం ధైర్యంగా రోడ్ల‌పైకి వ‌చ్చి స్వైర విహారం చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా ఓ దున్న‌పోతు వార్తల్లో నిలిచింది. రోడ్ల‌న్నీ ఖాళీగా ఉన్నాయ‌నుకుందో లేక అడ‌విలో తిరిగి బోర్ కొట్టిందేమో.. ఒక్క‌సారిగా రోడ్డుపైకి వ‌చ్చింది. ఖాళీగా ఉన్న రోడ్లు చూసి ఆశ్చ‌ర్య‌పోయి.. రోడ్డుపై సుకుమారంగా న‌డుచుకుంటూ అలా వెళ్లిపోయింది. (కరోనా : చైనాను అధిగమించిన అమెరికా)

దేశంలోనే అడ‌వి దున్న‌పోతులు ఎక్కువ‌గా ఉండే మ‌ల‌బార్ సివెట్‌లోని దున్న‌పోతు క‌ర్ణాట‌కలోని చిక్ మంగళూరు జిల్లా మార్కెట్ ప్రాంత‌లో షికార్లు చేసింది. దీంతో రోడ్ల‌పై ఉన్న కొంత మంది ప్ర‌జ‌లు కూడా ప‌క్క‌కు త‌ప్పుకొని దానికి దారిచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను భార‌త అట‌వీశాఖ అధికారి సుశాంత నంద సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ‘ఇండియ‌న్ బిసోన్‌ (అడ‌వి దున్న‌పోతు) వాకింగ్‌కు రోడ్ల‌పైకి వ‌చ్చింది. అతిపెద్ద బోవిన్‌.. ద‌క్షిణ‌, ఆగ్నేయాసియాకు చెందినది. చాలా దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తుంది. బ‌య‌ట అరుదుగా క‌నిపిస్తుంది’ అనే క్యాప్ష‌న్‌తో ట్విట‌ర్‌లో షేర్ చేశారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ అవ్వ‌డంతో దీన్ని చూసిన నెటిజ‌న్లు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. జాగ్ర‌త్త‌! పోలీసులు చూస్తే నిన్ను కూడా క్వారంటైన్‌కు త‌ర‌లిస్తారు. అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement