గర్భంలో అస్థిపంజరం! | Sakshi
Sakshi News home page

గర్భంలో అస్థిపంజరం!

Published Wed, Aug 20 2014 1:36 AM

గర్భంలో అస్థిపంజరం!

60 ఏళ్ల మహిళకు అరుదైన ఆపరేషన్
 
నాగ్‌పూర్: నాగ్‌పూర్‌లోని ఓ ఆస్పత్రి వైద్యులు ఇటీవల అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. 60 ఏళ్ల మహిళలో 36 ఏళ్లుగా ఉన్న అస్థిపంజరాన్ని  తొలగించారు. మధ్యప్రదేశ్‌లోని పిపారియాకు చెందిన కాంతాబాయ్ గుణవంత్ ఠాక్రే 1978లో  గర్భం దాల్చినా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ (గర్భాశయం వెలుపల పిండం ఎదగడం) కావడంతో  గర్భస్రావం జరిగింది.

పిండం అవశేషాలను వెలికితీసేందుకు ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉన్నా ఆమె భయపడింది. కానీ, రెండు నెలలుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్న ఆమె నాగ్‌పూర్‌లోని ఆస్పత్రిలో చూపించుకోగా బాధితురాలి ఉదరంలో ముద్ద లాంటి పిండం అస్థిపంజరాన్ని ఎమ్మారైలో గుర్తించి 14న నాలుగు గంటలపాటు శ్రమించి పిండం అవశేషాలను తొలగించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement