భారత విద్యార్థులకు ఆకర్షణీయమైన ఆఫర్‌! | Sakshi
Sakshi News home page

భారత విద్యార్థులకు ఆకర్షణీయమైన ఆఫర్‌!

Published Fri, Feb 12 2016 5:15 PM

భారత విద్యార్థులకు ఆకర్షణీయమైన ఆఫర్‌! - Sakshi

కోల్‌కత్తా: భారత విద్యార్థులను ఆకర్షించడానికి  యుకే(యునైటేడ్ కింగ్‌డమ్) ప్రభుత్వం ఉపకార వేతనాలను పెంచింది. గత కొన్నేళ్లుగా బ్రిటన్‌లో చదువుతున్న భారత విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని యుకే ప్రభుత్వం వెల్లడించింది. గతంలో ఉండే బోగస్ కాలేజీలన్నింటినీ తొలగించామని, ఇప్పుడు గుర్తింపు పొందిన కాలేజీలు మాత్రమే ఉన్నాయని మినిష్టర్ కౌన్సిలర్(పోలిటికల్,ప్రెస్) ఆఫ్ బ్రిటిష్ హై కమిషన్ ఆండ్రూ సోపర్ గురువారం విలేకరులకు తెలిపారు.

గ్రేట్ బ్రిటన్ పథకంలో భాగంగా విదేశీ విద్యార్థులకు 59 అండర్ గ్రాడ్యుయేట్, 232 పోస్టు గ్రాడ్యుయేట్‌ స్కాలర్‌షిప్స్‌ అందిస్తున్నామని తెలిపారు. యుకేలో చదువాలనుకునే భారత విద్యార్థుల కోసం విసాను కూడా సులభతరం చేశామని చెప్పారు. పదిమంది విద్యార్థుల్లో తొమ్మిది మందికి విసా వచ్చేలా చేస్తున్నామని యుకే ప్రభుత్వం తెలియజేసింది. భారతదేశంలో ఉన్న ముఖ్యమైన  మేనేజ్‌మెంట్ స్టడీస్, ఇంజనీరింగ్  కోర్సులుకూడా ఇక్కడ ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది భారత విద్యార్థులు 20వేల మంది వివిధ యూనివర్సిటీల్లో చదువుతున్నారని, వారికి రూ. 49 కోట్లు స్కాలర్‌షిప్‌లు అందుతున్నాయని బ్రిటిష్ కౌన్సిల్ ఇండియన్ డెరైక్టర్ రోబ్ లైన్స్ తెలిపారు. అయితే, 2013లో భారత విద్యార్థులు 24,000 మంది బ్రిటన్‌లో చదువుకున్నారని చెప్పారు. బ్రిటన్‌కు చెందిన వెయ్యిమంది విద్యార్థులు భారత్‌లో విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు.  
 

Advertisement
Advertisement