కార్మికుల గురించీ ఆలోచించండి | Sakshi
Sakshi News home page

కార్మికుల గురించీ ఆలోచించండి

Published Sat, Nov 29 2014 1:20 AM

కార్మికుల గురించీ ఆలోచించండి

  • లోక్‌సభలో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి
  •  ఎన్ని కార్మిక చట్టాలున్నా.. వాటి అమలుపై పర్యవేక్షణ లేదు
  •  చట్టాల అమలుపై  కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి
  • సాక్షి, న్యూఢిల్లీ: కార్మికులు, ఉద్యోగులు చట్టబద్ధమై న కనీస హక్కులకు కూడా నోచుకోవడం లేదని, కేంద్ర కార్మిక సంక్షేమ చట్టాల అమలుపై దృష్టి పెట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కడప లోక్‌సభ సభ్యుడు వై.ఎస్.అవినాశ్‌రెడ్డి కేంద్రాన్ని డిమాం డ్ చేశారు. కార్మికులు నిర్దేశిత పని గం టలకు మించి పనిచేస్తున్నప్పటికీ తగిన వేతనం లభించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

    కార్మిక చట్టం(రిటర్నుల దాఖలు మినహాయింపు, రిజిస్టర్ల నిర్వహణ మినహాయింపు) సవరణ బిల్లు-2014పై శుక్రవారం జరి గిన చర్చలో ఆయన ప్రసంగించారు. ‘‘యాజమాన్యాలకు కొన్ని మినహాయింపులు ఇచ్చేందుకు ఈ బిల్లు తెస్తున్నారు. గతంలో 19లోపు ఉద్యోగులు కలిగిన సంస్థలకే ఈ రిటర్నుల దాఖలు, రిజిస్టర్ల నిర్వహణ మినహాయిం పులు వర్తించేవి.

    ఇప్పుడు ఆ సంఖ్యను 40గా మార్చారు. యాజమాన్యాల కోసం ఉద్యోగుల సంఖ్యలో మార్పులు చేసిన ఈ బిల్లు.. ఒకవేళ యాజమాన్యాలు కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తే ఆ మేరకు విధించాల్సిన జరిమానాలు మాత్రం పెంచలేదు. ఉద్యోగుల సంఖ్యను 19 నుంచి 40కి పెంచిన కేంద్రం మరో ముఖ్యమైన విషయాన్ని కూడా గమనించాలి. ప్రస్తుతం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి.

    అందువల్ల చాలా మూల దనం, ఎక్కువ టర్నోవర్, ఎక్కువ లాభాలు ఉన్న సంస్థలు కూడా 20కి తక్కువగా ఉద్యోగులను నియమించుకుంటున్న దాఖలాలు ఉన్నాయి’’ అని అవినాశ్ గుర్తుచేశారు. ఈ బిల్లుపై స్టాండింగ్ కమిటీ చేసిన సిఫారసులను పరిగణనలోకి తీసుకోవడం మంచిది’’ అని పేర్కొన్నారు. కేంద్రం కార్మిక చట్టాలను సమర్థంగా అమలు చేసేందుకు పూర్తి దృషి ్టపెట్టాలన్నారు. ఇప్పటివరకు కార్మికులకు మేలు కలిగించగలిగిన పాత చట్టాలను పలుచన చేయకుండా చూడాలని కోరారు.  
     

Advertisement

తప్పక చదవండి

Advertisement