రాహుల్ త్వరలో తిరిగొస్తారు: సోనియా | Sakshi
Sakshi News home page

రాహుల్ త్వరలో తిరిగొస్తారు: సోనియా

Published Sun, Mar 29 2015 1:23 AM

రాహుల్ త్వరలో తిరిగొస్తారు: సోనియా - Sakshi

అమేథీ(యూపీ): సెలవులో ఉన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ త్వరలో తిరిగి వస్తారని ఆ పార్టీ చీఫ్ సోనియా గాంధీ తెలిపారు.  ‘రాహుల్ త్వరలో తిరిగి వస్తారు. వచ్చాక ఇక్కడికీ(అమేథీ)కి వస్తారు’ అని చెప్పారు. రాహుల్ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీలో సోనియా శనివారం పర్యటించారు.

పర్వే  గ్రామానికి వెళ్లి.. ఇటీవల రైలు ప్రమాదంలో చనిపోయిన అయూబ్ అనే రైతు నేత కుటుంబాన్ని పరామర్శించారు.  ఈ సందర్భంగా రాహుల్ ఎప్పుడొస్తారని ఓ విలేకరి ఆమెను ప్రశ్నించగా, ‘రాహుల్, ప్రియాంక, నా కుటుంబం తరఫున ఇక్కడ ఉన్నా’ అని అన్నారు. దీంతో ఓ విలేకరి, ‘అమేథీ రాహుల్ నియోజకవర్గం’ అని అన్నారు. సోనియా వెంటనే ‘అమేథీ, రాయ్‌బరేలి రెండూ నేను పనిచేసే నియోజకవర్గాలే’ అని బదులిచ్చారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement