భారత్‌ - జపాన్‌ స్మార్ట్ నగరాల వారసత్వ ఒప్పందం | Sakshi
Sakshi News home page

భారత్‌ - జపాన్‌ స్మార్ట్ నగరాల వారసత్వ ఒప్పందం

Published Sat, Aug 30 2014 8:39 PM

నరేంద్ర మోడీ,షిన్జో అబేల సమక్షంలో ఒప్పంద పత్రాలను మార్చుకుంటున్నదీపా గోపాలన్, దైసాక కాడోకవా. - Sakshi

క్యోటో:భారత్‌ - జపాన్‌ స్మార్ట్ నగరాల వారసత్వ ఒప్పందం కుదిరింది.  ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహించే అతి పురాతన భారతీయ ఆధ్యాత్మిక నగరం వారణాసికి, వెయ్యి ఏళ్లకు పైగా జపాన్కు రాజధానిగా ఉంటున్న క్యోటో నగరాల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ, జపాన్ ప్రధాని షిన్జో అబేల సమక్షంలో భారత రాయభారి దీపా వాధ్వా, క్యోటో మేయర్ దైసాక కాడోకవా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. పత్రాలను మార్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం వారసత్వ పరిరక్షణ, విద్య, సాంస్కృతిక రంగాలలో ఈ రెండు నగరాలు సహకరించుకుంటాయి.

అంతకు ముందు అయిదు రోజుల జపాన్ పర్యటకు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఒసాకా ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం పలికారు.

Advertisement
Advertisement