బీజేపీపై కత్తిగట్టిన మాయావతి | Sakshi
Sakshi News home page

బీజేపీపై కత్తిగట్టిన మాయావతి

Published Mon, Jul 24 2017 1:12 PM

బీజేపీపై కత్తిగట్టిన మాయావతి - Sakshi

లక్నో: రాజ్యసభకు రాజీనామా చేసిన తర్వాత బీఎస్పీ అధినేత్రి మాయావతి బీజేపీ పార్టీపై కత్తిగట్టారు. దళితులకు వ్యతిరేకంగా బీజేపీ అనుసరిస్తున్న విధానాలను ఒక ఉద్యమంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. పార్టీ ఎంపీలతో, సీనియర్‌ నేతలతో, వ్యూహకర్తలతో సమావేశం నిర్వహించిన అనంతరం ఆమె ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇక నుంచి ప్రతి నెల 18న ప్రత్యేకంగా పార్టీ వర్కర్ల సమావేశాన్ని అన్ని నియోజవర్గాల్లో నిర్వహించి బీజేపీ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. దీనిని వచ్చే సెప్టెంబర్‌లో ప్రారంభించి వచ్చే జూన్‌ వరకు కొనసాగిస్తామని తెలిపారు.

దాదాపు ఉద్యమ రూపంలో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాన్ని సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైన చారిత్రక ప్రాంతం మీరట్‌లో ప్రారంభిస్తామన్నారు. పార్టీ వ్యూహకర్తలతో సమావేశం అనంతరం షహరాన్‌పురాలో విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. తనను సభలో మాట్లాడేందుకు అనుమతించడం లేదని, అందుకు నిరసనగా తాను రాజీనామా చేస్తున్నానని ప్రకటించగా ఈ నెల (జూలై) 18న రాజ్యసభ చైర్మన్‌ హమీద్‌ అన్సారీ ఆమె రాజీనామాను ఆమోదించారు. కాగా, ఆమె పదవీ కాలం దగ్గరపడటంతో రాజీనామా డ్రామాలు ఆడారంటూ పలువురు బీజేపీ నేతలు ఆరోపించారు.

Advertisement
Advertisement