'తొలి ప్రేమ కథ'కు 25 మంది డబ్బులు పెట్టారు | Sakshi
Sakshi News home page

'తొలి ప్రేమ కథ'కు 25 మంది డబ్బులు పెట్టారు

Published Tue, Mar 25 2014 12:39 PM

'తొలి ప్రేమ కథ'కు 25 మంది డబ్బులు పెట్టారు

తాను తొలిసారిగా మెగాఫోన్ పట్టకుని దర్శకత్వం వహించిన సినిమా 'తొలి ప్రేమకథ'కు 25 మంది స్నేహితులు కలిసి డబ్బులు పెట్టారని ఆ చిత్ర దర్శకుడు వసంత్ దయాకర్ చెప్పారు. 'ఈ సినిమా పూర్తి చేయడానికి నాకు 25 మంది స్నేహితులు సాయం చేశారు. వాళ్లందరికీ నేను ఎంతగానో రుణపడి ఉంటాను. వాళ్లే లేకపోతే నా సినిమా ఇంకా స్క్రిప్టు దశలోనే ఉండిపోయేది. చిన్న బడ్జెట్లో రూపొందించిన వినోదాత్మక ప్రేమకథా చిత్రమిది' అని ఆయన అన్నారు.

నందమూరి బాలకృష్ణ నటించిన భారీ చిత్రం 'లెజెండ్' విడుదలవుతున్న శుక్రవారమే ఈ చిన్న సినిమా కూడా తెరమీదకు రానుంది. తమకు మరో వారం దొరుకుతుందో లేదోనని ఈ వారమే విడుదల చేస్తున్నామని, ఆ తర్వాత ప్రతి వారం దాదాపు నాలుగు నుంచి ఐదు సినిమాల వరకు విడుదల అవుతున్నాయని దయాకర్ తెలిపారు. చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం కష్టం అయిపోతోందని, అందుకే లెజెండ్తో పాటే తమ సినిమా కూడా విడుదల చేస్తున్నామన్నారు. వీలైనన్ని ఎక్కువ చిన్న థియేటర్లు తీసుకుని, అన్నిచోట్లా విడుదల చేస్తున్నామని తెలిపారు. ఈ సినిమాలో సిద్ధు, అనిల్, నిఖిత, కనికా తివారీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement