ఆ క్షణం సుశాంత్‌లో నన్ను చూసుకున్నా: క్రికెటర్‌ | Sakshi
Sakshi News home page

సుశాంత్‌ ఆత్మహత్య: ‘అదే పరిస్థితిని నేను ఎదుర్కొన్నా’

Published Tue, Jun 23 2020 10:49 AM

Sreesanth Opens Up On His Depression After Sushant Singh Rajput Suicide - Sakshi

ముంబై: బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ ఆత్మహత్య బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. సుశాంత్‌ మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నట్లు ముంబై పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే. అప్పటీ నుంచి పలువురు బాలీవుడ్‌ నటులు తాము కూడా ఒత్తిడికి గురయ్యామంటూ తమకు ఎదురైన చేదు అనుభవనాలు పంచుకుంటున్నారు. తాజాగా బిగ్‌బాస్‌ 12 కంటెస్టెంట్, క్రికెటర్‌ శ్రీశాంత్.. సుశాంత్‌ ఆత్మహత్యపై స్పందించాడు. సుశాంత్‌ మరణ వార్త తనను బాగా ప్రభావితం చేసిందన్నాడు. (సుశాంత్‌ మృతిపై విచారణకు ఎల్జేపీ నేత డిమాండ్‌)

గతంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణాలకు పాల్పడినట్లు శ్రీశాంత్‌పై ఆరోపణలు రావడంతో అతడిపై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. అయితే గతేడాది దానిని బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ జస్టిస్‌ డీకే జైన్‌ ఏడేళ్లకు కుదించారు. దాంతో అతడి నిషేధం ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగియనుండటంతో అతని రీఎంట్రీ ఖాయమైంది. ఫలితంగా కేరళ తరఫున ఆడటానికి రంగం సిద్ధం చేసుకున్న శ్రీశాంత్‌.. ‘ఒకప్పుడు నేను చీకటిని చుశానని మీకు తెలుసు. ఆ సమయంలో నేను తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాను. ఇంటి నుంచి అసలు బయటకు వచ్చేవాడిని కాదు. అలా ఒంటరిగా గడపుతున్న క్రమంలో ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు కూడా వచ్చాయి’ అంటూ తాను ఎదుర్కొన్నా చేదు అనుభవాన్ని ఈ సందర్భంగా శ్రీశాంత్‌ గుర్తుచేసుకున్నాడు. (‘ఆ సినిమా నుంచి సుశాంత్ అభిమానిగా మ‌రాను’)

‘‘నేను ఒంటరిగా నా గదిలో ఉన్నప్పుడు  నిరాశ, ఒత్తిడికి లోనయ్యేవాడిని. కానీ రూమ్‌ నుంచి చిరునవ్వుతో బయటకు వచ్చేవాడిని. ఎందుకంటే నా బలహీనతను, నిరాశను నా తల్లిదండ్రులు చూపించాలనుకోలేదు. ఎందుకంటే బయటి ప్రపంచానికి నేను శ్రీశాంత్‌ని కానీ నా పేరెంట్స్‌కి మాత్రం గోపుని. కానీ నా గదిలో నేను ఏంటన్నది నాకు కూడా తెలియదు. ఇది నేను 2013లో నిరంతరాయంగా పోరాడిన చీకిటి కాలం. అందుకే సుశాంత్ సింగ్ మరణ వార్త నన్ను బాగా ప్రభావితం చేసింది. తన మరణానికి కారణం తెలియగానే ఆ క్షణం సుశాంత్‌లో నన్ను చూసుకున్నాను’’ అంటు చెప్పుకొచ్చాడు. 

Advertisement
 
Advertisement
 
Advertisement