హిందీ టెంపర్‌ | Sakshi
Sakshi News home page

హిందీ టెంపర్‌

Published Fri, Oct 27 2017 1:14 AM

Ranveer Singh In Remake of Jr NTR Temper Movie

‘‘యూజర్‌ నేమ్‌ రణ్‌వీర్, పాస్‌వర్డ్‌ పోలీస్‌. దమ్ముంటే నా ఇగో వైఫైని దాటి రండిరా’.. ఏంటి మన ‘టెంపర్‌’ సినిమాలో డైలాగ్‌లా ఉందే అనుకుంటున్నారా? ఎన్టీఆర్‌ డైలాగ్‌లో యూజర్‌నేమ్‌ దయ కదా. బాలీవుడ్‌ యాక్టర్‌ రణ్‌వీర్‌ ఎందుకు వచ్చారనే డౌట్‌ అక్కర్లేదు. ఎందుకంటే ‘టెంపర్‌’ హిందీ రీమేక్‌లో రణ్‌వీర్‌ నటించనున్నారు.

రణ్‌వీర్‌సింగ్‌ హీరోగా ‘గోల్‌మాల్‌’, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’, ‘సింగమ్‌ రిటర్న్స్‌’ వంటి చిత్రాలను తెరకెక్కించిన రోహిత్‌ శెట్టి ఈ సినిమాను రూపొందించనున్నారు. ‘‘రణ్‌వీర్‌ బిగ్‌ స్టారే కాదు బ్రిలియంట్‌ యాక్టర్‌ కూడా. అతనితో ‘టెంపర్‌’ సినిమాను రీమేక్‌ చేయనున్నాను. ఈ సినిమా గురించి అతను కూడా ఎగై్జట్‌గా ఉన్నాడు. రణ్‌వీర్‌ లుక్‌ కొత్తగా ఉంటుంది. వచ్చే ఏడాదిలో సినిమాను స్టార్ట్‌ చేయాలనుకుంటున్నాం’’ అని పేర్కొన్నారు రోహిత్‌ శెట్టి.

Advertisement
 
Advertisement
 
Advertisement