అసలు హీరో వచ్చేశాడు! | Sakshi
Sakshi News home page

అసలు హీరో వచ్చేశాడు!

Published Fri, May 22 2015 5:27 PM

అసలు హీరో వచ్చేశాడు!

పొత్తిళ్లలో ఉన్న రోజుల పిల్లాడిని ఒక మహిళ చెయ్యి ఎత్తి పట్టుకుంటుంది. ఆ పోస్టర్ తొలిసారిగా.. మే 1వ తేదీన విడుదలైంది. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా గత రెండున్నరేళ్లుగా తీస్తున్న బాహుబలి సినిమాకు సంబంధించిన తొలి పోస్టర్ అది. తర్వాత ఇన్నాళ్లకు.. అంటే సరిగ్గా 22 రోజులకు అదే పిల్లవాడు పెద్దవాడై.. సాహస విక్రమ ధీశాలిగా, రణతంత్ర కళా కుశలిగా యుద్ధక్షేత్రంలో విజృంభిస్తున్న పోస్టర్ను రాజమౌళి తన ట్విట్టర్, ఫేస్బుక్ పేజీల ద్వారా విడుదల చేశారు.

ఇంతకుముందు కూడా ప్రభాస్ పోస్టర్ ఒకటి విడుదల చేసినా, అందులో పెద్ద శివలింగాన్ని తన కుడి భుజం మీద మోసుకెళ్తున్నట్లుగా ఉంటుంది. అయితే.. ప్రభాస్ను అసలైన యుద్ధవీరుడిగా చూపించిన పోస్టర్ మాత్రం ఇదే. అసలైన రాజు బాహుబలి అంటూ.. ఈ పోస్టర్ను రాజమౌళి విడుదల చేశారు. దీంతో కలిపి మొత్తం 11 పోస్టర్లను రోజు విడిచి రోజు రాజమౌళి విడుదల చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement