కేసు వెనక్కి తీసుకున్న అల్లు అరవింద్ | Sakshi
Sakshi News home page

కేసు వెనక్కి తీసుకున్న అల్లు అరవింద్

Published Thu, Jun 8 2017 1:58 PM

కేసు వెనక్కి తీసుకున్న అల్లు అరవింద్

బాలీవుడ్ రిలీజ్ కు రెడీ అవుతున్న రాబ్తాపై టాలీవుడ్ లోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఈ సినిమా టాలీవుడ్ సూపర్ హిట్ సినిమా మగధీరకు కాపీ అంటూ.. హీరోయిన్లు వందల ఏళ్లనాడు ప్రేమించుకోవటం.. తమ ప్రేమను గెలిపించుకోవడానికి తిరిగి జన్మించటం.. హీరో వంద మంది యోధులతో తలపడటం లాంటి సీన్లు రాబ్తాలో ఉన్నాయన్న వార్తలు రావటంతో ఇది మగధీరకు కాపీ అన్న టాక్ బలంగా వినిపించింది.

మగధీర నిర్మాత అల్లు అరవింద్ కూడా ట్రైలర్ ను చూసి ఈ సినిమా మగధీరకు కాపీ నే అన్న ఆలోచనలో రాబ్తా యూనిట్ పై కేసు వేశాడు. రాబ్తా యూనిట్ మాత్రం తమ సినిమా కాపీ అన్న వార్తలను ఖండించింది. కేవలం రెండు నిమిషాల ట్రైలర్ చూసి సినిమా కాపీ అని ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించింది. బుధవారం కోర్టు ముందు కూడా ఇదే వాదన వినిపించింది. కోర్లు రాబ్తా సినిమా ఫుల్ స్క్రిప్ట్ ను కూడా అదంజేసింది.

రాబ్తా యూనిట్ వాదనతో సంతృప్తి చెందిన కోర్టు వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో ఈ రోజు(గురువారం) ఉదయం రాబ్తా యూనిట్ పై వేసిన కేసును అల్లు అరవింద్ వెనక్కి తీసుకున్నారు. దీంతో రేపు రాబ్తా రిలీజ్ కు లైన్ క్లియర్ అయ్యింది. సుశాంత్ సింగ్ రాజ్పుత్, కృతిసనన్ జంటగా తెరకెక్కిన రాబ్తాకు దినేష్ విజన్ దర్శకుడు.

Advertisement
 
Advertisement
 
Advertisement