అమ్మో... అదే లేకపోతే..! | Sakshi
Sakshi News home page

అమ్మో... అదే లేకపోతే..!

Published Wed, Feb 10 2016 10:21 PM

అమ్మో... అదే లేకపోతే..!

చిరిగిన చొక్కా అయినా తొడుక్కో...మంచి పుస్తకం కొనుక్కో... ఇది పాత సామెత. ఇప్పడు చొక్కా లేకపోయినా ఫర్లేదు... స్మార్ట్‌ఫోన్ కంపల్సరీ అంటోంది నేటి తరం. అంతలా జీవితంలో ఫోన్ భాగమైపోయింది.  కానీ, మీకు మరీ అంత సెల్‌ఫోన్ మీద మితిమీరిన  ధ్యాస ఉంటే ‘నోమోఫోబియా’ ఉన్నట్టే! నమ్మకం లేదా! అదేంటి! విచిత్రంగా ఉందనుకుంటున్నారా? నటి ప్రియాంకా చోప్రాకు కూడా అచ్చం ఇదే రకమైన ఫోబియా ఉందట.
 
 కథేమిటంటే... ‘మిమ్మల్ని బాగా భయపెట్టే విషయాలేంటి’ అంటూ కథానాయిక సోనమ్‌కపూర్ ఓ సినిమా ప్రచారంలో భాగంగా నెటిజన్లను అడిగారు. బాలీవుడ్ కథానాయిక ప్రియాంకా చోప్రా కూడా దీనికి స్పందించి, ట్విట్టర్ వీడియోలో తన భయం గురించి చెప్పారు ‘‘పుట్టినప్పుడే మనతో పాటు వచ్చేదే ప్రేమ.
 
 ఆ తర్వాత నేర్చుకునేదే భయం. ఈ భయం ఇప్పుడు అందరికీ ఉండేదే. అదే నోమో ఫోబియా. అంటే నో మొబైల్ ఫోన్ ఫోబియా. ఎక్కడి కైనా వెళ్లినప్పుడు నా ఫోన్‌లో సిగ్నల్ ఉండదేమో, నా మొబైల్‌లో బ్యాటరీ అయిపోతుందేమో అని భయ పడుతూ ఉంటాను’’ అని తన ఫోబియా గురించి చెప్పు కొచ్చారు ప్రియాంక. అన్నట్లు, ఈ భయం ఇప్పుడు ఫోన్ అతిగా వాడుతున్న మనందరికీ ఉందేమో కదూ!
 

Advertisement
Advertisement