లెక్కలు తీస్తే ..టాప్ లో మహేష్ బాబు | Sakshi
Sakshi News home page

లెక్కలు తీస్తే ..టాప్ లో మహేష్ బాబు

Published Sat, Dec 20 2014 7:40 AM

లెక్కలు తీస్తే ..టాప్ లో మహేష్ బాబు - Sakshi

రెండు మూడు స్థానాల్లో బన్నీ, ప్రభాస్
పవర్స్టార్ కంటే మెగాస్టార్కే ఎక్కువ మార్కులు



హైదరాబాద్: అభిమానులు తమకు నచ్చిన సినిమా హీరోల గురించి, వాళ్ల విశేషాల గురించి గూగుల్లో వెతకడం ఎప్పటినుంచో ఉంది. గడిచిన దశాబ్ద కాలంలో ఇది బాగా ఎక్కువైంది. ఇలా ఇప్పటివరకు పదేళ్ల కాలంలో అంటే.. 2004 నుంచి 2014 వరకు గూగులమ్మను ఎక్కువగా ఎవరి గురించి అడిగారని లెక్కలు తీస్తే.. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు అగ్రస్థానంలో నిలిచాడు. 2005 సంవత్సరంలో మహేష్ బాబుకు నమ్రతతో పెళ్లయింది. అప్పటినుంచి గౌతమ్, సితార పుట్టడం, ఇతర విశేషాల కోసం మహేష్ అభిమానులు గూగుల్ తల్లిని అడుగుతూనే ఉన్నారు. అందుకే మహేష్ గూగుల్ సెర్చ్లో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు.

ఇక ఈ దశాబ్దకాలంలో గూగుల్ సెర్చ్ ట్రెండ్స్లో మరో కొత్త విశేషం ఉంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కంటే, మెగాస్టార్ చిరంజీవి కోసమే ఎక్కువ మంది గూగుల్ను వెదుకులాడారు. చిరంజీవి నాలుగోస్థానంలో ఉంటే.. పవన్ కల్యాణ్ ఐదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక పదేళ్లలో టాప్ సెర్చ్లలో రెండో స్థానంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మూడో స్థానంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నిలిచారు.

Advertisement
Advertisement