నా సపోర్ట్ పవన్ కళ్యాణ్కే: రేణు దేశాయ్ | Sakshi
Sakshi News home page

నా సపోర్ట్ పవన్ కళ్యాణ్కే: రేణు దేశాయ్

Published Mon, Apr 14 2014 12:01 PM

నా సపోర్ట్ పవన్ కళ్యాణ్కే: రేణు దేశాయ్ - Sakshi

తన మాజీ భర్త పవన్ కళ్యాణ్పై రేణు దేశాయ్ ప్రశంసలు కురింపించారు. పవన్ లాంటి మంచి మనిషి ఈ భూమిపై మరొకరు ఉండరంటూ ఆకాశానికెత్తేశారు. ఆయనను స్వచ్ఛమైన మానవత్వం కలిగిన మనిషిగా వర్ణించారు. కరుణ, దయ కలిగిన కల్మషం లేని మనిషని పేర్కొన్నారు. పవన్ దయార్ద హృదయుడని పొడిగారు. వ్యక్తిగత జీవితంలో తమ మధ్య ఏం జరిగిందో తామిద్దరికి మాత్రమే తెలుసునని పేర్కొన్నారు. దీనిపై కామెంట్ చేసేందుకు బయటివాళ్లకు హక్కు లేదన్నారు.

తానెంతో గౌరవించి, అభిమానించే వ్యక్తుల్లో పవన్ ఒకరని అన్నారు. సమాజానికి మంచి చేయాలన్న తపనతో నిజాయితీగా పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయనకు ఎల్లప్పుడు తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ లాంటి మంచి మనషులు సమాజానికి ఎంతో అవసరమని ఫేస్బుక్లో పేర్కొన్నారు. తన ఫేస్బుక్ పేజీలో పవన్ కళ్యాణ్ అభిమానులు అభ్యంతరకర మెసేజ్‌లు పోస్ట్ చేస్తున్నారని ఇంతకుముందు రేణు దేశాయ్ వాపోయారు.

Advertisement
Advertisement