లెజెండరీ నటుడి 'హవేలి'ని కూల్చేస్తున్నారు! | Sakshi
Sakshi News home page

లెజెండరీ నటుడి 'హవేలి'ని కూల్చేస్తున్నారు!

Published Sun, Jan 17 2016 7:39 PM

లెజెండరీ నటుడి 'హవేలి'ని కూల్చేస్తున్నారు!

పెషావర్‌: పాకిస్థాన్‌ పెషావర్‌లోని బాలీవుడ్ లెజెండరీ నటుడు రాజ్‌కపూర్‌కు చెందిన చారిత్రక నివాసాన్ని పాక్షికంగా కూల్చేశారు. ఈ నివాసం స్థానంలో ఓ ప్లాజా కట్టాలని భావిస్తున్న యజమానులు.. దాని మొదటి అంతస్తును కూల్చేశారు. దీంతో వెంటనే స్పందించిన ఖైబర్ పఖ్తూన్ఖా అధికారులు కూల్చివేతను ఆపివేయించారు.

స్థానిక కోర్టులో స్టే ఉత్తర్వులు తీసుకురావడం ద్వారా తాత్కాలికంగా కూల్చివేతకు బ్రేక్ పడింది. అయితే ఈ ఉత్తర్వులు వచ్చేలోపు యజమానులు 'హావేలి' (కోట) మొదటి అంతస్తును మొత్తం కూల్చేశారు. బాలీవుడ్ దిగ్గజ నటులు రాజ్‌కపూర్, దిలీప్‌కపూర్ పెషావర్‌లో జన్మించారు. దీంతో వారి నివాసాలను చారిత్రక వారసత్వ సంపదగా కాపాడుతామని ఖైబర్ పఖ్తూన్‌కా ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అయినప్పటికీ రాజ్‌కపూర్‌ 'హవేలి' భారీగానే ధ్వంసమైంది.

పాక్ ప్రభుత్వం ఏమైనా చేసుకోని!
రాజ్‌కపూర్‌ నివాసాన్ని  కూల్చివేయడంపై ఆయన కుమారుడు, నటుడు రిషి కపూర్ స్పందించారు. పెషావర్‌లోని తమ తాత పృథ్వీరాజ్‌ కపూర్ నివాసంతో తమకు ఎలాంటి భావోద్వేగమైన అనుబంధం లేదని, ఆ నివాసాన్ని పాకిస్థాన్‌ ప్రభుత్వం ఏం కావాలంటే అది చేసుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు. ఆ నివాసాన్ని తామెన్నడూ చూడలేదని ఆయన చెప్పారు.

Advertisement
 
Advertisement
 
Advertisement