ఫిడెల్ క్యాస్ట్రో మరణంతో అంతటా విషాదం
హవానా: కమ్యూనిస్టు నేత, దేశ మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో మరణంతో క్యూబా శోకసంద్రంలో మునిగిపోయింది. ఆదివారం దేశమంతటా ప్రజల విషాద వదనాలతో నిశ్శబ్దం అలముకుంది. ఎక్కడా ఎలాంటి అధికారిక కార్యక్రమాలనూ నిర్వహించలేదు. 50 ఏళ్లు పాలన సాగించిన క్యాస్ట్రో చరిత్ర పుటల్లో నిలిచిపోయేలా తుది వీడ్కోలు పలికెందుకు దేశం సిద్ధమవుతోంది. సంతాప సభలు, 4 రోజుల పాటు ఆయన పార్థివదేహంతో యాత్ర జరిపి డిసెంబరు 4న శాంటియాగోలో అంత్యక్రియలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. క్యాస్ట్రో 1953లో శాంటియాగో నుంచే విప్లవోద్యమానికి శ్రీకారం చుట్టారు. శుక్రవారం రాత్రి క్యాస్ట్రో(90) అనారోగ్యంతో తుది శ్వాస విడవడం తెలిసిందే. హవానాలోని చారిత్రక రివల్యూషన్ స్క్వేర్‌లో సంతాప సభలు సోమవారం మొదలవుతాయి.
నా జీవితం కంటే ఎక్కువ...
క్యాస్ట్రో మరణంతో క్యూబన్ల గుండెలు పగిలారుు. ‘ఏం చెప్పగలను? క్యాస్ట్రో నా జీవితం కంటే ఎక్కువ’ అని కన్నీటి పర్యంతమయ్యారు 82 ఏళ్ల ఆరోరా మెండెజ్. పేదల కోసం పోరాడిన యోధుడని కొనియాడారు. ప్రస్తుత క్యూబా జనాభాలో చాలామంది పుట్టక ముందే క్యాస్ట్రో పోరాటం, ధీరత్వం... స్కూలు పుస్తకాలు, పత్రికలన్నింటా నిండిపోయారుు. మార్గదర్శకుడిగా నిలిచి, సామాజిక, ఆర్థిక అసమానతలు లేకుండా దేశానికి దిశానిర్దేశం చేసిన యోధుడు లేకుండా వారు తమ జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నారు. కొందరు ఆందోళన చెందుతుంటే... ఆయన నింపిన విశ్వాసంతో దేశం ముందుకు సాగుతుందని మరికొందరు ఆశిస్తున్నారు. కొందరు మాత్రం... ఫిడెల్ మరణంతో ఆయన తమ్ముడు, అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రో నాయకత్వంలో క్యూబా ఆర్థికంగా మరింత వేగంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతుం దని భావిస్తున్నారు.
అంత్యక్రియలకు క్యాస్ట్రో సోదరి దూరం
మయామి: ఫిడెల్ క్యాస్ట్రో అంత్యక్రియలకు ఆయన సోదరి జువానిత హాజరుకాబోవడం లేదని అమెరికా మీడియా పేర్కొంది. ‘ఫిడెల్ అంత్యక్రియలకు వెళుతున్నానన్న ఊహాగా నాల్లో నిజం లేదు. తిరిగి క్యూబాకు వెళ్లే ప్రసక్తే లేదు’ అని దశాబ్దాలుగా అమెరికాలోని మియామీలో ఉంటున్న జువానిత చెప్పారని వెల్లడించింది. ఫిడెల్ కమ్యూనిస్టు ప్రభుత్వా న్ని జువానిత బహిరంగంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. క్యాస్ట్రోను తొలగించేం దుకు సీఐఏకు సహకరించారని ఆమెపై ఆరోపణలున్నారుు.
శోకసంద్రంలో క్యూబా
Published Mon, Nov 28 2016 1:30 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూ.2.71 లక్షల వంచన
ఎన్నికల సామగ్రితో తరలిన సిబ్బంది
జిల్లాలో నేటి ఓటింగ్‌కు సర్వం సిద్ధం
ఓటుకు రూ.100–200ల పంపిణీ
సురపుర విజేత ఎవరో?
ముగ్గురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు
ట్రాక్టర్ ఇంజిన్ బోల్తా పడి డ్రైవర్ మృతి
నేడే మలివిడత ఎన్నికలు
ఎమ్మెల్యే కారును ఢీకొని ఇద్దరు మృతి
నేటి పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement