ఇంద్రకరణ్‌ను మంత్రి పదవినుంచి తప్పించాలి | Sakshi
Sakshi News home page

ఇంద్రకరణ్‌ను మంత్రి పదవినుంచి తప్పించాలి

Published Sat, Feb 25 2017 3:38 AM

ఇంద్రకరణ్‌ను మంత్రి పదవినుంచి తప్పించాలి

సీఎంకు రేవంత్‌ బహిరంగలేఖ
సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వం– ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యంతో గృహనిర్మాణశాఖ చేపట్టిన జాయిం ట్‌ వెంచర్లలో అవినీతికి పాల్పడిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించాలని టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెం ట్‌ రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం సీఎంకు ఆయన బహిరంగ లేఖ రాశారు.

గత ప్రభుత్వాలు కూకట్‌పల్లి, గచ్చిబౌలి, వరంగల్, ఖమ్మం తది తర ప్రాంతాల్లో ప్రారంభించిన జాయింట్‌ వెంచర్లలో 10%గృహాలను పేదలు, అల్పాదాయ వర్గాల కోసం నిర్మించాలని అప్పట్లోనే ఒప్పందం జరిగిందన్నారు. అయితే ఈ ఎల్‌ఐజీ ఇళ్లను తొలగించాలని ప్రైవేట్‌ సంస్థలు ఒత్తిడి తెచ్చినప్పటికీ గత ప్రభుత్వాలు పేదలకు అన్యాయం చేయలేదన్నారు. ఇప్పుడు ఇంద్రకరణ్‌ ఎల్‌ఐజీ ఇళ్లను తొలగించి పేదలకు తీరనిద్రోహం చేశారన్నారు. ప్రైవేటు కంపెనీలకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం ద్వారా ఆయన అవినీతికి పాల్పడ్డారన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement