పటేల్ కృషివల్లే హైదరాబాద్ భారత్లో విలీనం | Sakshi
Sakshi News home page

పటేల్ కృషివల్లే హైదరాబాద్ భారత్లో విలీనం

Published Fri, Oct 31 2014 8:57 AM

పటేల్ కృషివల్లే హైదరాబాద్ భారత్లో విలీనం

హైదరాబాద్ :  సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం ఉదయం హైదరాబాద్లో జాతీయ సమైక్యతా పరుగును ప్రారంభించారు.  అంతకు ముందు ఆయన అసెంబ్లీ ముందున్న పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ ఐకమత్య సూత్రానికి కట్టుబడి ఉంటామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి చేత తెలుగులో ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ వల్లభాయ్ పటేల్ జయంతి హైదరాబాద్లో జరుపుకోవటం సంతోషకరంగా ఉందన్నారు. పటేల్ కృషివల్లే హైదరాబాద్ భారతదేశంలో విలీనమైందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశ విభజన సమయంలో పటేల్ కీలక పాత్ర వహించారని కొనియాడారు. మోదీ సంకల్పించిన జాతీయ ఐక్యతా పరుగును విజయవంతం చేయాలని రాజ్నాథ్ కోరారు.

ఐక్యతా రన్‌ పటేల్ విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ వరకు కొనసాగుతుంది. పటేల్ జయంతిని జాతీయ ఏక్తా దివస్‌గా నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు ప్రజల్లో సమైక్యతా భావాన్ని పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులతో పాటు నగరానికి చెందిన బీజేపీ నేతలు పాల్గొన్నారు.

 

అనంతరం రాజ్నాథ్ సింగ్ రాజేంద్ర నగర్ లోని సర్దార్ పటేల్  పోలీస్ అకాడమీలో  పాసింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొన్నారు. 66వ బ్యాచ్ ఐపీఎస్ లు శిక్షణ పూర్తి చేసుకోగా,ఈ ముగింపు కార్యక్రమంలో రాజ్ నాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement