వారిది బానిస మనస్తత్వం | Sakshi
Sakshi News home page

వారిది బానిస మనస్తత్వం

Published Sun, Feb 26 2017 2:51 AM

వారిది బానిస మనస్తత్వం - Sakshi

కాంగ్రెస్‌ నేతలపై మంత్రి జగదీష్‌రెడ్డి ధ్వజం  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కోసం ఉద్యమం చేస్తున్నప్పుడు ఆంధ్ర యాజ మాన్యాలు ఇచ్చే బీ–ఫారాలు, మంత్రి పదవుల కోసం తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు మోకరిల్లారని విద్యుత్‌ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ఇప్పుడేమో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూస్తున్నారని అన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యమ కాలంలో కలసి రాకపోయినా, ఇప్పుడు కూడా సొంత రాష్ట్రంలో పిల్లిమొగ్గలు వెయ్యడం సిగ్గుచేటన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఇప్పటికీ బానిస మనస్తత్వంతో ఉన్నారని, తెలంగాణలో దానికి భిన్నంగా ప్రజలే యజ మానులుగా ప్రభుత్వం నడుస్తుండడంతో కాంగ్రెస్‌ పార్టీకి మింగుడుపడడం లేదని ధ్వజమెత్తారు. ఆ కారణంగానే తెలంగాణ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారని, విపక్షాల కుట్రలను తిప్పికొడతామని స్పష్టం చేశారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై విపక్షాలు అసత్య ప్రచారాలు మానుకోవాలని సూచించారు. ఎన్ని అడ్డం కులు సృష్టించినాసరే నీటి ప్రాజెక్టులు కట్టి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్‌ ప్రారంభించిన ప్రాజెక్టులు అనేకం పూర్తి కాలేదని, ప్రాజెక్టులను పూర్తిచేయడానికి ప్రతి పక్షాలు ప్రభుత్వంతో కలసి రావాలని సూచించారు.

పుట్టగతులుండవనే...
పలు ప్రాజెక్టులపై ప్రతిపక్షాలు 29 పిటిషన్లు వేశాయన్నారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు అనుచరుల పేరుతో హైకోర్టులో పిటిషన్లు వేస్తున్నా రన్నారు. ప్రాజెక్టులు పూర్తయితే విపక్షాలకు పుట్టగతులు ఉండవనే ప్రాజెక్టుల ను అడ్డుకుంటున్నారన్నారు. మరో వైపు ప్రతిపక్ష పార్టీల నేతలు సీఎం కేసీఆర్‌ మీద, ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేలు తున్నారన్నారు. ఇలాంటి విమర్శలు చేస్తే ఇప్పుడున్న నేతల్లో ఒక్కరు కూడా వచ్చే ఎన్నికల్లో గెలవరని, కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని హెచ్చరించారు. నిజానికి కాంగ్రెస్‌ ఒక రాజకీయ పార్టీగా కాకుండా ఓ దొంగల ముఠాగా వ్యవహరి స్తోందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని బతికించుకునేందుకు అబద్దాల మీద అబద్దా లు ఆడుతున్నారన్నారు. కేసీఆర్‌ ప్రజారంజక పాలన మీద తెలంగాణ ప్రజలు సంతృప్తిక రంగా ఉన్నారని, అందుకే రాష్ట్ర ప్రజలు మెదక్‌ ఉప ఎన్నికల నుంచి పాలేరు ఉపఎన్నికల వరకు టీఆర్‌ఎస్‌కు నీరాజనం పలికారన్నారు.

Advertisement
Advertisement