నగరంలో భారీ అగ్ని ప్రమాదం | Sakshi
Sakshi News home page

నగరంలో భారీ అగ్ని ప్రమాదం

Published Tue, Apr 21 2015 9:49 AM

fire accident in hyderabad

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నగరంలోని బేగం బజార్ ఉస్మాన్ గంజ్లో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఉన్న పూజ జనరల్ స్టోర్స్ భవనంలోని మూడు అంతస్తుల్లో మంటలు ఎగిసి పడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో అక్కడికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. అయితే  ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement