ఓయూను ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలి | Sakshi
Sakshi News home page

ఓయూను ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలి

Published Sat, Apr 29 2017 2:54 AM

ఓయూను ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలి

ఓయూ శతాబ్ది ఉత్సవాల్లో రక్షణ శాఖ సలహాదారు సతీశ్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ ప్రమాణాలను అందిపుచ్చుకునేలా ఉస్మానియా వర్సిటీ నిర్దిష్ట ప్రణాళికలను రూపొందించుకొని ఆ దిశగా ముందుకు సాగాలని రక్షణ శాఖ సలహాదారు జి.సతీశ్‌రెడ్డి సూచించారు. ఓయూను ప్రపంచ విశ్వవిద్యాలయాల సరసన నిలబెట్టాలని ఆకాంక్షించారు. అది నెరవేరాలం టే వర్సిటీలో అందుకు తగినట్టుగా వివిధ రంగాల్లో పరిశోధనలు జరగాలన్నారు. ఉస్మాని యా శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన శుక్రవారం నిర్వహించిన ‘ఓయూ విజన్‌’ చర్చా కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఒక్క శాతం విద్యార్థులు కూడా పరిశోధనల వైపు వెళుతున్న పరిస్థితి కనుచూపు మేరలో లేకపో వడం ఆందోళనకరమన్నారు. ప్రపంచంలోని టాప్‌ 100 యూనివర్సిటీల్లో దేశంలోని వర్సి టీలు కూడా ఉన్నప్పుడే అన్ని రంగాల్లో అభి వృద్ధి సాధించగలమన్నారు. విదేశాల్లో స్థిరపడ్డ భారతీయుల తోడ్పాటును తీసుకోవడంవల్ల మరిన్ని ఫలితాలొస్తాయన్నారు.

మేధో సంపత్తి అవసరం...
ఓయూ మాజీ వీసీ వీఎస్‌ ప్రసాద్‌ మాట్లా డుతూ... రక్షణ, శాస్త్ర, సాంకేతిక, విద్యా రంగా ల్లో తెలంగాణ తనదైన ముద్ర వేసు కొనేలా ఇక్కడ పరిశోధనలు జరగాలన్నారు. దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుంటే నాణ్య మైన ఉచిత విద్యను అందరికీ అందుబాటులోకి తేవొచ్చ న్నారు. సీసీఎంబీ మాజీ డైరెక్టర్‌ సీహెచ్‌ మోహన్‌రావు మాట్లాడుతూ... పరిశోధనాత్మక రంగాల్లో బహుళ స్థాయిల్లో కృషి జరగాల న్నారు. కావల్సింది ర్యాంకులు, మార్కులు కాదని.. సమాజ గమనాన్ని అర్థం చేసుకొని, భవిష్యత్‌ భారతాన్ని నిర్మించగలిగిన మేధో సంపత్తని చెప్పారు.

ఉన్నత విద్యా రంగ పరిరక్షణకు ప్రభుత్వం శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని ఈపీఈ డైరెక్టర్‌ ఆర్‌.కె.మిశ్రా చెప్పారు. అమెరికా పరిణామాలను గమనిం చిన తరువాత ఎప్పుడు ఏ దేశ విదేశాంగ విధానాలు ఎలా ఉంటాయో ఊహించడం కష్టంగా మారిందన్నారు. ఎవరిపైనో ఆధార పడకుండా స్వీయ శాస్త్రీయ పరిశోధనల వైపు విశ్వవిద్యాలయాలు కృషి చేయాలని అగ్రి సొల్యూషన్స్‌ సీఈఓ మేజర్‌ సి.భరత్‌కుమార్‌ సూచించారు. 2025 నాటికి దేశంలో ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల్లో 30 శాతం, 2030కి 90 శాతం ఉద్యోగాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. అందుకనుగుణంగా సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు జరగాలన్నారు. ఓయూ వీసీ రామచంద్రం, రిజిస్ట్రార్‌ గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement