
బీజేపీ నేతలైనా ఆగి చూడాల్సిందే....
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్ఈడీ జంబో మొబైల్ టీవీ ప్రచారాన్ని బీజేపీ ఎంపీ అభ్యర్థి హరిబాబు ఆసక్తిగా వీక్షించారు
విశాఖ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్ఈడీ జంబో మొబైల్ టీవీ ప్రచారాన్ని బీజేపీ ఎంపీ అభ్యర్థి హరిబాబు ఆసక్తిగా వీక్షించారు. వివరాల్లోకి వెళితే విశాఖ పూర్ణా మార్కెట్ సమీపంలోని దుర్గాలమ్మ గుడి జంక్షన్లో విజువల్ చిత్ర ప్రదర్శన ప్రారంభించేసరికి బీజేపీ నాయకులు ప్రచార వాహనంపై అటుగా వెళుతున్నారు.
ట్రాఫిక్ రద్దీ వల్ల అక్కడ కాసేపు ఆగాల్సి వచ్చింది. వారు సైతం చూపు తిప్పుకోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజువల్స్ను తిలకించారు. హరిబాబు కూడా టీవీ ప్రచారాన్ని తిలకించారు.