కిరణ్‌కుమార్‌రెడ్డికి షాక్

కిరణ్‌కుమార్‌రెడ్డికి షాక్ - Sakshi


వైఎస్సార్ సీపీలో బరకం రవికుమార్‌రెడ్డి చేరిక


తుడుచుకుపెట్టుకుపోయిన జేఎస్పీ


 కలకడ, న్యూస్‌లైన్: మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి సొంత నియోజకవర్గమైన పీలేరులో పెద్ద షాక్ తగిలింది. ఐదు దశాబ్దాలకు పైగా, రెండు తరాలుగా నల్లారి కుటుంబంతో అనుబంధం ఉన్న బరకం రవికుమార్‌రెడ్డి బుధవారం రాత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.


వైఎస్సార్ సీపీ రాజంపేట లోక్‌సభ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఆయన చేరికను వైఎస్సార్ సీపీ సీనియుర్ నాయకులు వంగి మళ్ల మాధుసూదన్‌రెడ్డి, జెల్లా రాజగోపాల్‌రెడ్డి స్వాగతించారు. అలాగే కోన సర్పంచ్ పుల్లమ్మ, టీడీపీ నాయకులు రెడ్డెప్ప తదితరులు వైఎస్సార్ సీపీలో చేరారు.

 

నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు కిషోర్‌కుమార్‌రెడ్డి జేఎస్పీ పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీ చేస్తున్నారు. అయితే బరకం రవికుమార్‌రెడ్డి వైఎస్సార్ సీపీలో చేరడంతో జే ఎస్పీకి కోలుకోలేని దెబ్బ తగిలింది.  ముడేళ్ల క్రితం మాజీ మండలాధ్యక్షులు వంగివుళ్ల మధుసూదన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డిని విభేదించి పక్కకు వచ్చిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి బరకం రవికుమార్‌రెడ్డి రాకతో కలకడ మండలంలో నల్లారి వర్గం దాదాపుగా తుడుచుపెట్టుకు పోయినట్టు అయింది. అదే సమయంలో పీలేరు నియోజకవర్గంలో వంగిమళ్ల మాధుసూదన్‌రెడ్డి వర్గం బలపడడం, వైఎస్సార్ సీపీకి మంచి పట్టు లభించినట్టు అయింది.  

 

బరకం నేపథ్యం ఇదీ

 

క్లాస్-1 కాంట్రాక్టరుగా ఉన్న బరకం రవికుమార్‌రెడ్డి తండ్రి నరసింహారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నల్లారి అమర్‌నాథరెడ్డిలు దశాబ్దాల కాలం కలిసి ఉన్నారు. నరసిం హారెడ్డి వాయల్పాడు సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షులుగా, పీలేరు సమితి సభ్యులుగా, జిల్లా బోర్డు సభ్యులుగా ఉండి మండలంలో, నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడుగా ఉన్నారు.



దీంతో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి వర్గంలోని ఆంతరంగికుల్లో ముఖ్యమైన వ్యక్తుల్లో రవికుమార్‌రెడ్డి ఒకరు. రవికుమార్‌రెడ్డి వైఎస్సార్ సీపీ చేరికలో కడప డీసీసీబీ చైర్మన్ ఆవుల విష్ణువర్దన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థి చింతలరావుచంద్రారెడ్డి, వైఎస్సార్ సీపీ నాయుకు లు వంగిమళ్ల మాధుసూదన్‌రెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి జెల్లారాజగోపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top